IT Raid at Hero Aryas Residence: హీరో ఆర్య నివాసంలో ఐటీ దాడులు!
చెన్నైలో సీ షెల్ రెస్టారెంట్లపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రెస్టారెంట్ చైన్ తో గతంలో సంబంధాలున్న హీరో ఆర్య నివాసంపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅన్నా నగర్, వేలచ్చేరి సహా నగరంలోని పలు సీ షెల్ రెస్టారెంట్ శాఖల్లో జూన్ 18 బుధవారం ఉదయం నుంచీ తనిఖీలు కొనసాగుతున్నాయ్. సేమ్ టైమ్ పూనమల్లి హై రోడ్ లో ఉన్న ఆర్య నివాసంలోనూ ఐటీ బృందం సోదాలు చేపట్టింది.
గతంలో ఆర్య ఈ అరేబియన్ రెస్టారెంట్ చైన్ ను ప్రారంభించాడు.ఆతర్వాత కొన్నాళ్లకు కేరళకు చెందిన కున్హి మూసా అనే బిజినెస్ మెన్ కు విక్రయించాడనే వార్తలొచ్చాయి.
కేరళలో కున్హి మూసాకు సంబంధించిన ప్రాపర్టీస్ పై ఐటీ అధికారులు నిఘా పెట్టారు...ఆ విచారణలో భాగంగానే చెన్నైలో ఈ రెస్టారెంట్లు, ఆర్య నివాసంపై దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది
రెస్టారెంట్ ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య మార్పులకు సంబంధించిన అంశాలపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్య కేరళకు చెందిన వ్యక్తి అయినప్పటికీ అరిన్తుమ్ అరియామలుమ్ సినిమాతో తమిళ మూవీస్ తో హీరోగా క్లిక్కయ్యాడు. ప్రస్తుతం ఆర్య వెట్టువమ్ సినిమాలో నటిస్తున్నాడు. పా.రంజిత్ దర్శకుడు.