Bappi Lahiri: ఇక ‘ఆకాశంలో ఒక తార’ బప్పి లహరి, ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే ఔరా అంటారు!
బెంగాలీ కుటుంబానికి చెందిన బప్పి లహరి అసలు పేరు అలోకేష్ లహరి. పశ్చిమ బెంగాల్‌లోని జలపాయ్‌గురిలో బప్పి 1952లో జన్మించారు. - Image Credit: Bappi Lahiri/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆయన తల్లిదండ్రులు బన్సరీ లహరి, అలోకేష్ లహరి పేరొందిన గాయకులు. - Image Credit: Bappi Lahiri/Instagram
బప్పి లహరి ఇద్దరు ప్రముఖ గాయకులు మహ్మద్ రఫీ, కిశోర్ కుమార్‌లతో కలిసి ‘నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్’ పాటను ఆలపించి రికార్డుల్లో నిలిచారు. ఈ అవకాశం మరే గాయకుడు, సంగీత దర్శకుడికి రాకపోవడం విశేషం. - Image Credit: Bappi Lahiri/Instagram
1983-1985 మధ్య కాలంలో బప్పి లహరి జితేంద్ర హీరోగా నటించిన 12 చిత్రాలకు వరుసగా సంగీతాన్ని అందించి రికార్డుల్లో నిలిచిపోయారు. ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. - Image Credit: Bappi Lahiri/Instagram
ఒక్క రోజులోనే అత్యధిక పాటలకు సంగీతాన్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా బప్పిలహరి పేరు నిలిచిపోయింది. - Image Credit: Bappi Lahiri/Instagram
బప్పి లహరి ఫేమస్ సాంగ్ ‘జిమ్మీ జిమ్మీ ఆజ ఆజ’ పాటను 2008లో ‘యు డోన్ట్ మెస్ విత్ జొహాన్’ అనే హాలీవుడ్ సినిమాలో ఉపయోగించారు. - Image Credit: Bappi Lahiri/Instagram
‘ఇట్స్ రాకింగ్ దర్ద్ - ఇ - డిస్కో’ చిత్రంలో బప్పీ పూర్తి నిడివి గల పాత్రలో నటించారు. - Image Credit: Bappi Lahiri/Instagram
బప్పి లహరి రోజుకు కనీసం 7 నుంచి 8 కిలోల బంగారాన్ని ధరిస్తారు. ఎందుకంటే బంగారం అదృష్టాన్ని అందిస్తుందనేది ఆయన నమ్మకం. - Image Credit: Bappi Lahiri/Instagram
బప్పి లహరి దగ్గర 2014 నాటికి 75 తులాల బంగారం ఉంది. అతడి భార్య పేరుపై 96 తులాల బంగారం ఉంది. బప్పీ పేరు మీద 4.62 కిలోల వెండి, భార్య పేరున 8.9 కిలోల వెండి ఉంది. రూ.4 లక్షలు విలువ చేసే వజ్రాలు కూడా ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లు. ప్రతి ధన్‌తెరస్‌కు ఆయన భారీగా బంగారం కొంటారు. దాన్ని బట్టి చూస్తే.. ఈ ఎనిమిదేళ్లలో మరింత బంగారాన్ని బప్పి కొనుగోలు చేసి ఉండవచ్చు. - Image Credit: Bappi Lahiri/Instagram
బప్పీ తెలుగులో సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పలు చిత్రాలకు పనిచేశారు. కృష్ణ నటించిన ‘సింహాసనం’ చిత్రానికి సంగీతం అందించినది బప్పి లహరియే. ‘ఆకాశంలో ఓ తార..’ అనే సాంగ్ ఇప్పటికీ ఫేమస్సే. కృష్ణ నటించిన ‘తేనే మనసులు’, ‘శంఖారావం’, చిరంజీవి నటించిన ‘స్టేట్ రౌడీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’, బాలకృష్ణ నటించిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘నిప్పు రవ్వ’, మోహన్ బాబు నటించిన ‘రౌడీ గారి పెళ్ళాం’, ‘పుణ్యభూమి నా దేశం’ సినిమాలకు సంగీతం అందించారు. - Image Credit: Bappi Lahiri/Instagram
రవితేజ నటించిన ‘డిస్కో రాజా’లో ‘‘రమ్ పమ్ రమ్...’’ పాటను బప్పి లహరి ఆలపించారు. గాయకుడిగా ఆయన చివరి తెలుగు పాట అదే. సంగీత దర్శకుడిగా తెలుగులో బప్పీ లహరి చివరి సినిమా అంటే ‘పాండవులు పాండవులు తుమ్మెద’. - Image Credit: Bappi Lahiri/Instagram