Deepthi Sunaina: అతడు బెస్ట్ ఫ్రెండ్ కాదు, లవర్ - దీప్తి సునయనకు ‘ఏమై ఉండొచ్చో’
‘‘ఇదేంటీ, దీప్తి సునయన ఈ యువకుడి గుండెపై వాలిపోయింది. ఆమెకు ఏమై ఉండచ్చో’’ అని అనుకుంటున్నారా? కంగారు పడకండి. ఈ ఫొటో తాజాగా ఆమె నటించిన ‘ఏమైవుండొచ్చో’ వీడియో ఆల్బమ్‌లోని స్టిల్స్. ఆమెకు జోడిగా ఆనంద్ పాత్రలో నటించిన విజయ్‌తో కలిసి దిగిన ఆ ఫొటోలను ఆమె శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘‘బెస్ట్ ఫ్రెండ్ (హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ). మాయా లవ్స్ ఆనంద్’’ అని పోస్ట్ చేసింది. కేవలం ఆ వీడియో ఆల్బమ్ మాత్రమే కాదు, ఈ ఫొటోలు కూడా ఆమె అభిమానులకు బాగా నచ్చేశాయి. - Image Credit: Deepthi Sunaina/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇక పాట విషయానికి వస్తే.. వినయ్ షన్ముక్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఏమై ఉండొచ్చో’ అనే ఆల్బమ్ సాంగ్ ఇటీవలే యూట్యూబ్‌లో విడుదలైంది. విజయ్ బాల్గానిన్ ఈ పాటకు సంగీత దర్శకత్వం మాత్రమే కాదు, గాత్రం కూడా తానే అందించాడు. ఇందులో దీప్తి సునయనకు జోడిగా సుగి విజయ్ నటించాడు. అతడి ప్రియురాలిగా దివ్య నటించింది. ఈ పాటలో మంచి ఫీల్ మాత్రమే కాదు, మనోవేదన కూడా ఉంటుంది. - Image Credit: Deepthi Sunaina/Instagram
గత కొన్నేళ్లుగా ఆనంద్(విజయ్)కు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న మాయ(దీప్తి) అతడిపై ఫీలింగ్స్ మారుతాయి. అతడిని స్నేహితుడి కంటే ఎక్కువగా, ప్రేమికుడిగా భావిస్తుంది. ఈ విషయాన్ని స్లామ్ బుక్‌లో రాస్తుంది. - Image Credit: Deepthi Sunaina/Instagram
పుట్టిన రోజు సందర్భంగా అతడిని విష్ చేయడం కోసం మాయా.. మనాలిలో ఉన్న ఆనంద్‌ను కలవడానికి వెళ్తుంది. కానీ, స్లామ్ బుక్‌ను అతడికి ఇచ్చి ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది. - Image Credit: Deepthi Sunaina/Instagram
కానీ, అప్పటికే అతడు వేరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడితో మనాలిలో ఉంటుంది. అతడి ప్రేమ ఉన్నా.. మనసు చంపుకుని పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు మనసులోనే కుమిలిపోతూ కన్నీళ్లు ఆపుకుంటుంది. పెళ్లి రోజు ఆనంద్ గర్ల్‌ఫ్రెండ్ మాయా స్లామ్ బుక్ చూస్తుంది. ఆమె ఆనంద్‌ను ప్రేమిస్తుందని తెలుసుకుంటుంది. - Image Credit: Deepthi Sunaina/Instagram
దివ్య కూడా ఆనంద్‌ను ప్రేమిస్తుండటంతో మాయా ప్రేమను అతడికి చెప్పదు. చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. మాయా వారికి పెళ్లిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. - Image Credit: Deepthi Sunaina/Instagram
మాయాది నిజంగానే ప్రేమా? స్నేహమా ఇంకా ఏమైననా అనేది సురేష్ బనిశెట్టి తన లిరిక్స్‌తో చాలా చక్కగా వెల్లడించాడు. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ పాట 1.6 మిలియన్ పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. - Image Credit: Deepthi Sunaina/Instagram
దీప్తి గతంలో నటించిన ‘మలుపు’, ‘తట్టుకోలేదే’ బ్రేకప్ సాంగ్స్ కూడా మంచి వ్యూస్ సంపాదించుకున్నాయి. అయితే, ఈ పాటను స్వయంగా ‘సోనీ మ్యూజిక్ సౌత్’ స్వయంగా తమ యూట్యూబ్ చానెల్‌లో విడుదల చేయడం గమనార్హం. - Image Credit: Deepthi Sunaina/Instagram
- Image Credit: Deepthi Sunaina/Instagram