Year Ender 2025: ధనుష్ నుండి జైదీప్ అహ్లావత్ వరకు... ఈ ఏడాది యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న స్టార్లు వీళ్ళే
'పోన్మన్' సినిమాలో బసిల్ జోసెఫ్ ఒక డ్రమాటిక్ రోల్ చేశారు. మొదట అతనిది ఒక సహాయక పాత్రలా అనిపిస్తుంది. కానీ కథతో పాటు అతని పాత్ర సినిమాకు కేంద్ర బిందువుగా మారుతుంది. అతని నటన చాలా ప్రభావవంతంగా ఉంది.
'హోమ్ బౌండ్' సినిమాలో మొహమ్మద్ షోయబ్ అలీ పాత్రలో ఇషాన్ ఖట్టర్, చందన్ కుమార్ పాత్రలో విశాల్ జేత్వా నటించారు. ఇద్దరూ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ చేశారు.
'ఖౌఫ్'లో మోనికా పన్వార్ పాత్ర సైతం ప్రశంసలు అందుకుంది. ఆమె నటన గత జ్ఞాపకాల తాలూకా గాయం, మానసిక భయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది.
'బైసన్ కాలమాడన్'లో కబడ్డీ ప్లేయర్ కిట్టాన్ పాత్ర చేశారు ధ్రువ విక్రమ్. క్రీడాకారుడికి అవసరమైన ఫిజికలిటీ, అలాగే తీవ్రమైన భావోద్వేగాలు చక్కగా చూపించారు. చాలా సహజంగా నటించారు.
'పుర్టౌన్' సినిమాలో షర్మిలా ఠాగూర్ ఒక ఆక్టోజెనేరియన్ మహిళ పాత్రను పోషించారు. ఆమె నటన చాలా బావుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, అలాగే అంతర్గత కలతలను ఆమె నటన సహజంగా చూపించింది.
'కాంతా' సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ఓ శరణార్థి యువతి పాత్రను తెరపై చక్కగా చూపించారు. ఆమె పాత్ర మొత్తం సినిమా మూడ్‌ను తెలియజేస్తుంది.
'మిథ్య'లో ఎమోషనల్ పెయిన్ ను అతీష్ శెట్టి చాలా ఎఫెక్టివ్ గా ఎక్స్ప్రెస్ చేశాడు. అతని సన్నివేశాలు డైలాగ్స్ లేకుండా కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.
'పాతాళ్ లోక్' సీజన్ 2లో హాథీరామ్ చౌదరి పాత్ర పోషించారు జైదీప్ అహ్లావత్. అతని నటన చాలా శక్తివంతంగా ఉంది. కోపం, సమగ్రత, నష్టం, విముక్తి వంటి అన్ని భావోద్వేగాలను అతను చాలా చక్కగా సమతుల్యం చేశాడు.
'కుబేరా'లో దేవా పాత్రలో ధనుష్, దీపక్ తేజ్ పాత్రలో కింగ్ అక్కినేని నాగార్జున అద్భుతంగా నటించారు. ఇద్దరి నటనలో ఎమోషనల్ రేంజ్ చాలా విస్తృతంగా ఉంది.
'సిస్టర్ మిడ్ నైట్'లో కాంప్లెక్స్ క్యారెక్టర్ ఉమాగా నటించారు రాధికా ఆప్టే. అసహ్యత నుండి నిరాశ వరకు ఆమె అన్ని భావోద్వేగాలను తెరపై అద్భుతంగా చూపించారు.