Vishwak Sen - TheraChaapa First Look : 'తెరచాప' ఫస్ట్ లుక్ విడుదల చేసిన విశ్వక్ సేన్
నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని, శ్రీలు హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకుడు. అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్ పతాకాలపై కైలాష్ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైంది. (Image Courtesy : Terachapa Movie)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'తెరచాప' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ (Image Courtesy : Terachapa Movie)
విశ్వక్ సేన్ మాట్లాడుతూ నాకు 'తెరచాప' కథ తెలుసు. ఈ సినిమా నిర్మాణం గురించి, ఎలా తీస్తున్నారనేది నాకు చెబుతూ వస్తున్నారు. టైటిల్, పోస్టర్ డిజైనింగ్ చాలా బావుంది. సినిమా హిట్ కావడంతో పాటు ఈ టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. 'తెరచాప' చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్'' అన్నారు అన్నారు. (Image Courtesy : Terachapa Movie)
నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని, శ్రీలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ 'తెరచాప' సినిమాలో జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేష్, పృథ్వీరాజ్, 'ఫిష్' వెంకట్, 'జబర్దస్త్' అశోక్, 'జబర్దస్త్' నాగి, 'జబర్దస్త్' అప్పారావు, 'రైజింగ్' రాజు ఇతర ప్రధాన తారాగణం. (Image Courtesy : Terachapa Movie)
'తెరచాప' చిత్రానికి మాటలు - పాటలు : మిద్దె మనోజ్‌కుమార్, ఛాయాగ్రహణం : అజీమ్ - వెంకట్, స్టంట్స్ : రాజ్‌కుమార్, నృత్య దర్శకత్వం : జీవన జార్జ్, కళా దర్శకత్వం : చరణ్, కాస్ట్యూమ్ డిజైనర్ : బొద్దు అమూల్య, కూర్పు : బొడిసింగి రాజు, సంగీతం: ప్రజ్వల్ క్రిష్. (Image Courtesy : Terachapa Movie)