This Week Theatrical Releases : మంత్ ఎండ్ థియేటర్లలో చిన్న సినిమాలు - పెద్ది ముందు పెద్ద సాహసమే...

ఈ వారం థియేట్రికల్ మూవీస్
అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ సస్పెన్స్ త్రిల్లర్ మరీచిక. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.
గ్రామంలో జరిగే వింత సంఘటనల ఆధారంగా రాబోతోన్న క్రైమ్ సస్పెన్స్ త్రిల్లర్ సందిగ్ధం. నిహాల్, ప్రియ దేశ్ పాక్ జంటగా నటించిన ఈ సినిమాకు పార్థసారథి కొమ్మోజు దర్శకత్వం వహించారు. ఈ నెల 29న సినిమా రిలీజ్ కానుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా బ్లాస్ట్. సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్‌తో పాటు అభిరామి, ప్రీతి ముకుందన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 28న సినిమా థియేటర్లలోకి రానుంది.
మలయాళ స్టార్ హీరో ఆంటోనీ వర్గీస్, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కాట్టలన్'. యాక్షన్ త్రిల్లర్ మూవీ ఈ నెల 28న తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.