Sreeleela: శ్రీలీల క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ చూశారా! - నెట్టింట ఫోటోలు వైరల్
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందరినీ మెప్పించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీలీల తాజాగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది.
శ్రీలీల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతుండగా 'Post Hibernation' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి.
శ్రీలీల పెళ్లి సందడి అనుకున్నంత విజయం సాధించలేకపోయినప్పటికీ ఆ తర్వాతి సినిమా ధమాకా మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాల్లో మెరిసింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో విజయ్ దేవరకొండ 'VD12' (వర్కింగ్ టైటిల్), ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రాజు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి.