Ram Pothineni: రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చిన రామ్... భాగ్యశ్రీతో రెండు పాటలు & ఇంకా ఏం చేశారంటే?

ఉస్తాద్ రామ్ పోతినేని (Ustad Ram Pothineni) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఓ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు పి (Director Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ఈ సినిమా రాజమండ్రి షెడ్యూల్ పూర్తి అయ్యింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
హీరోగా రామ్ 22వ చిత్రమిది. అందుకని #RAPO22 అని సినిమా యూనిట్ వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసింది. రాజమండ్రిలో జరిగిన సెకండ్ షెడ్యూల్‌లో 34 రోజుల పాటు నాన్ స్టాప్‌గా డే అండ్ నైట్ షూట్ చేశారు. ఇందులో రెండు పాటలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్, ఇంపార్టెంట్ టాకీ సీన్స్ కంప్లీట్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను మరింత అందంగా పిక్చరైజ్ చేశారట.

రాజమండ్రిలో షెడ్యూల్‌లో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే సహా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితర తారాగణం చిత్రీకరణ చేశారు. ఈ నెల (మార్చి) 28న హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ నూని, సంగీతం: వివేక్ - మెర్విన్, సీఈవో: చెర్రీ.
'ఆంధ్రా కింగ్ తాలూకా' టైటిల్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాలో సాగర్ రోల్ చేశారు రామ్ పోతినేని.