Priyanka Chopra Met Gala Looks : ఈసారి రెట్రో లుక్‌తో అలరించిన ప్రియాంక చోప్రా.. 2017 నుంచి గ్లోబల్ బ్యూటీ మెట్ గాలా లుక్స్ ఇవే
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 5వసారి మెట్ గాలా ఈవెంట్‌కు హాజరైంది. ఈసారి రెట్రో లుక్‌లో వచ్చింది. తెల్లని డ్రెస్‌పై బ్లాక్ డాట్స్‌తో ఈ డ్రెస్‌ని రూపొందించారు డిజైనర్స్.
నిక్ జోనస్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా డ్రెస్ సెట్ చేస్తూ కపుల్ గోల్స్‌ని రెట్టింపు చేశాడు నిక్. ప్రియాంక ఇప్పటివరకు ఎలాంటి లుక్స్‌లో మెట్ గాలాకి హాజరైందో చూసేద్దాం.
ప్రియాంక తన మొట్ట మొదటి డెబ్యూను 2017లో ఇచ్చింది. భర్త నిక్ జోనస్‌తో కలిసి మెట్ గాలాలో డెబ్యూ ఇచ్చింది.
2018లో మెరూన్ బాడీకాన్ డ్రెస్‌లో హాజరైంది ప్రియాంక.
మెట్ గాలా 2019లో ఈ లుక్‌తో అందరినీ షాక్‌కి గురి చేసింది ప్రియాంక. అప్పట్లో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్, ట్రోల్ అయ్యాయి.
2023లో బ్లాక్ డ్రెస్‌లో సింపుల్, ఎలిగెంట్ లుక్ హాజరైంది ప్రియాంక. ఈ ఏడాదితో కలిపి ప్రియాంక మెట్ గాలాకు 5సార్లు హాజరైంది.