Parineeti Chopra Wedding Photos: పరిణీతి పరిణయం - ఉదయ్‌పూర్‌లో ఘనంగా బాలీవుడ్ భామ పెళ్లి, ఇవిగో ఫొటోలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ఏడు అడుగులు నడించింది.
సెప్టెంబరు 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు.
50 మందికిపైగా వీఐపీలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో వీరి కోసం ప్రత్యేకమైన విడిది ఏర్పాట్లు చేశారు.
ఈ పెళ్లికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్ కూడా హాజరయ్యారు.
టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ హర్బజన్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శివసేన నేత ఆదిత్య థాకరే తదితర ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా ప్రత్యేకమైన బోటులో ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం.
ఈ పెళ్లిలో పరిణీత.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర రూపొందించిన పెళ్లి దుస్తులు ధరించింది.
పరిణీతి కజిన్ ప్రియాంక చోప్రా మాత్రం పెళ్లికి హాజరు కాలేదు.