Sadaa Latest Photos: అందంతో ఫిదా చేస్తోన్న సదా
వెళ్లవయ్యా వెళ్లూ అంటూ 'జయం' సినిమాలో మురిపించిన సదా లకు ఇప్పటికీ అలాగే ఉంది.
యంగ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం'మూవీకి సంబంధించిన వార్తతో సదా పేరు మారుమోగింది. ఈ మధ్యే ఈ సినిమాలో ఐటెం సాంగ్ లిరిక్స్ విడుదలైంది. 'రారా రెడ్డి' అంటూ సాగే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. వాస్తవానికి ఈ సాంగ్ లో అంజలి ప్లేస్ లో సదా ఉండాల్సింది.
ఈ సాంగ్ చివర్లో 'జయం'లో 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్ పెట్టారు. ఇది ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చేసింది. వాస్తవానికి నితిన్ ఐటెం సాంగ్ కి బదులుగా 'రాను రానంటూనే చిన్నదో' పాటని కంప్లీట్ గా రీమిక్స్ చేయాలనుకున్నాడట. ఇందుకోసం సదాని సంప్రదిస్తే నో అనేసిందట.
నితిన్, సదా కలసి జయం మూవీలో నటించారు. అందుకే ఆ మూవీలో సాంగ్ రీమిక్స్ చేయించాలనుకున్నాడు నితిన్. సదా ఒప్పుకోపోవడంతో అంజలిని తీసుకొచ్చి ఐటెం సాంగ్ రాయించుకుని లాస్టులో 'రాను రానంటూనే చిన్నదో' పాట లిరిక్స్ పెట్టారు.
ఓ రకంగా చెప్పాలంటే సదా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందనే చెప్పాలి. మునుపటిలా సదాకి ప్రస్తుతం ఆఫర్స్ లేవు. మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసి ఉంటే ఆమె కెరీర్ కి ఇది బూస్టర్ అయిఉండేదంటున్నారు.
సదా (Image credit: Sadaa/Instagram)
సదా (Image credit: Sadaa/Instagram)
సదా (Image credit: Sadaa/Instagram)
సదా (Image credit: Sadaa/Instagram)