Naga Chaitanya Sobhita Wedding Photos: కొత్త జంట చైతూ - శోభిత షేర్ చేసిన మ్యారేజ్ ఫోటోలు... వాళ్ళిద్దరి అల్లరి, సందడి మామూలుగా లేదు
డిసెంబర్ 4, 2024న అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి జరిగింది. ఆ వెడ్డింగ్ ఫోటోలు కొన్నిటిని కుటుంబ సభ్యులు కొంతమంది షేర్ చేశారు. అయితే... ఇప్పుడు కొత్తజంట స్వయంగా తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అల్లరిగా, సందడిగా, సంతోషంగా ఆ పెళ్లి జరిగిందని ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. ఆ ఫోటోలను మీరు చూడండి. (Image Courtesy: sobhitad / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశోభిత మెడలో పూలమాల వేస్తున్న అక్కినేని నాగచైతన్య. ఆ తరువాత చైతు మెడలో మాల వేస్తున్న శోభత. (Image Courtesy: sobhitad / Instagram)
తలపై తలంబ్రాలు పడుతుంటే శోభిత ఎంత మురిసిపోతున్నారో కదూ! చైతుతో పెళ్లి అవుతున్న సంతోషం ఆవిడ ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదూ! (Image Courtesy: sobhitad / Instagram)
''మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం'' అంటూ ఈ పెళ్లి ఫోటోలకు కొత్తజంట క్యాప్షన్ ఇచ్చింది. (Image Courtesy: sobhitad / Instagram)
పెళ్ళికొడుకుగా నాగచైతన్య! ఇంతకుముందు కొన్ని సినిమాలలో చైతు పెళ్లి కొడుకుగా కనిపించారు అయితే ఎప్పుడు ఉన్నంత సంతోషంగా ఇంతకు ముందు లేరని చెప్పవచ్చు. (Image Courtesy: sobhitad / Instagram)
శోభిత ధూళిపాల మెడలో మూడు ముళ్ళు వేస్తున్న నాగచైతన్య. (Image Courtesy: sobhitad / Instagram)
తన భర్త నాగచైతన్యకు గంధం పూస్తున్న శోభిత. (Image Courtesy: sobhitad / Instagram)
పెళ్లి క్రతువులో భాగంగా జరుగుతున్న హోమంలో నెయ్యి పోస్తున్న నూతన వధూవరులు. (Image Courtesy: sobhitad / Instagram)
శోభిత కాలికి మెట్టెలు తొడుగుతున్న దృశ్యం. (Image Courtesy: sobhitad / Instagram)