Sitara Ghattamaneni: మహేష్ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్క పిల్ల... పరిచయం చేసిన సూపర్ స్టార్ ముద్దుల కూతురు సితార
Sitara Ghattamaneni Instagram Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒరిస్సాలో ఉన్నారిప్పుడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరి ఆయన ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని ఏం చేస్తుందో తెలుసా? ఇంటికి కొత్త బుజ్జి కుక్క పిల్లను తెచ్చుకుంది. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
తమ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్కపిల్ల ఆస్టన్ ను సితార ఘట్టమనేని అందరికీ పరిచయం చేశారు. ఇంట్రడ్యూసింగ్ ఆస్టన్ అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
ఆల్రెడీ మహేష్ బాబు ఇంట్లో ఓ పెంపుడు కుక్క ఉంది. ఇప్పుడు మరొకటి చేరింది. మూగ జవాలు అంటే మహేష్ బాబు కుటుంబానికి ఎంత ప్రేమ అనేది మరోసారి అభిమానులు అందరికీ తెలిసింది. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
మహేష్ బాబు ఇంట్లో తిరుగుతున్న కొత్త బుజ్జి కుక్క పిల్ల ఆస్టన్. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
మహేష్ ఇంట్లో పెంపుడు జంతువులు (Image Courtesy: sitaraghattamaneni / Instagram)