అన్వేషించండి
Fathers Day: స్టార్ హీరోస్.. క్యూట్ కిడ్స్ - ఫాదర్స్ డే బెస్ట్ విషెష్.. మనమూ ఓసారి చూసేద్దామా..
Fathers Day Special: 'ఫాదర్స్ డే' సందర్భంగా స్టార్ కిడ్స్ పిల్లలు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెష్ చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార, అల్లు అర్జున్ పిల్లలు నెట్టింట సందడి చేశారు.
సెలబ్రిటీలకు పిల్లల ఫాదర్స్ డే విషెష్
1/6

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఆయనకు సోషల్ మీడియా వేదికగా 'ఫాదర్స్ డే' విషెష్ తెలిపారు. తండ్రితో కలిసి కొన్ని మిర్రర్ ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
2/6

'హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.. ఐ లవ్ యూ సో మచ్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మహేష్ బాబు కూడా సితార నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు.
3/6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌కు 'ఫాదర్స్ డే' విషెష్ తెలిపారు. 'హ్యాపీ ఫాదర్స్ డే టు మై గాడ్' అంటూ తన తండ్రిపై తన ప్రేమను చాటుకున్నారు.
4/6

అలాగే, బన్నీ తన పిల్లలు అయాన్, అర్హ నుంచి స్పెషల్ కేక్ అందుకున్నారు. 'హ్యాపీ 'ఫాదర్స్ డే'' అని రాసి ఉన్న చాక్లెట్ కలర్ కేక్‌ను గిఫ్ట్‌గా అందుకోగా.. 'థాంక్యూ అయాన్, అర్హ.. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా.' అంటూ రాసుకొచ్చారు.
5/6

కన్నడ స్టార్ యశ్ తన పిల్లలతో సరదాగా గడిపారు. ఈ వీడియోను ఆయన భార్య రాధికా పండిట్ ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. 'ప్రపంచంలోనే ది బెస్ట్ డాడ్. మా పిల్లల కోసం ఆయన చిన్న పిల్లాడిలా మారిపోతారు. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ రాసుకొచ్చారు.
6/6

ఇక ఫాదర్స్ డే సందర్భంగా నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తన పిల్లలతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు. ఈ ఫోటోలను నయన్ ఇన్ స్టాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. 'ప్రపంచంలోనే ఉత్తమ నాన్నకు ఫాదర్స్ డే విషెష్. మాకు బెస్ట్ లైఫ్ ఇచ్చినందుకు థాంక్స్. మాపై మీరు కురిపించే ప్రేమతో జీవితాన్ని చాలా అందంగా చేసినందుకు ధన్యవాదాలు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.' అంటూ ఆమె రాసుకొచ్చారు.
Published at : 15 Jun 2025 03:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
హైదరాబాద్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















