Chandrababu - Chiranjeevi - Nagababu: ఎమ్మెల్సీ నాగబాబును అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి
S Niharika | 02 Apr 2025 09:45 PM (IST)
1
మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు అన్నయ్య నుంచి అభినందన లభించింది.
2
శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నాగబాబు, ఆయన సతీమణి పద్మజ మర్యాదపూర్వకంగా కలిశారు.
3
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి నాగబాబు దంపతులు పుష్పగుచ్చం అందజేశారు.
4
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబును మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఆయనకు ఒక పెన్ బహుకరించారు.
5
ఎమ్మెల్యే విభాగంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన చేత శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు.
6
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వదినమ్మ సురేఖతో నాగబాబు