Poonam Bajwa: పూనమ్ బజ్వా షాకింగ్ లుక్ - పలుచని టాప్‌లో గ్లామర్ షోతో రెచ్చిపోయిన మలయాళ భామ
Poonam Bajwa Latest Photosపూనం బజ్వా.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కి టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేస్తూ కుర్రకారును కవ్వించింది.
'కలరింగ్(Coloring) అంటూ బుక్, పెన్సిల్ పట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సినిమాల్లో పద్దతిగా కనిపించే ఈమే లేటెస్ట్ ఫోటోల్లో గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా ఎప్పుడో 2005లో నవదీప్ ‘మొదటి సినిమా’లో హీరోయిన్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘పరుగు’, ‘వేడుక’ వంటి చిత్రాల్లో నటించి అలరించింది.
ఆ తర్వాత ఆమె తమిళం, మలయాళం, కన్నడ సినిమాలో వరుస ఆఫర్స్ అందుకుంటు స్టార్ నటిగా మారింది. లాంగ్ గ్యాప్ తర్వాత 2019లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
ఇందులో లోకేశ్వరి పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.