క్యూట్ స్మైల్ తో - కుర్రకారును ఫిదా చేస్తోన్న కీర్తీ సురేష్!
ABP Desam | 13 Aug 2023 03:09 PM (IST)
1
'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
2
ఇక ఆ తర్వాత 'మహానటి' సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పలికించిన హావభావాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
3
గత కొంతకాలంగా వరుస ప్లాపులతో ఉన్న కీర్తి సురేష్ ఈ ఏడాది 'దసరా' సినిమాతో పాన్ ఇండియా హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోనూ వెన్నెల పాత్రతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది.
4
ఇక రీసెంట్ గా తమిళంలో 'మామన్నాన్' అనే సినిమాతో మరో హిట్ అందుకున్న కీర్తి సురేష్ తాజాగా 'భోళాశంకర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటించింది.
5
ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది.
6
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.