Srikanth Birthday: హీరో శ్రీకాంత్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన చిరంజీవి - కేక్‌పై ఏం రాయించారో చూడండి!
Chiranjeevi- Srikanth: ఇండస్ట్రీలో చిరంజీవి, శ్రీకాంత్ అనుబంధం గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. వీరిద్దరు అన్నాతమ్ముళ్లుగా ఎప్పుడు ఒకరిపై ఒకరు అప్యాయతను పంచుకుంటారు.
Continues below advertisement
Image Credit: BA Raju/Twitter
Continues below advertisement
1/6
Chiranjeevi Celebrares Srikanth Birthday: మెగాస్టార్ చిరంజీవి, నటుడు శ్రీకాంత్ మంచి సన్నిహితంగా ఉంటారనే విషయం తెలిసిందే.
Continues below advertisement
2/6
మెగాస్టార్‌గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చిరుకు ఇండస్ట్రీలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతోమంది హీరోలు కూడా ఆయన అభిమానులే. ఈ విషయాన్ని వారే స్వయంగ చెబుతుంటారు. అందులో సీనియర్ హీరో, నటుడు శ్రీకాంత్ కూడ ఒకరు.
3/6
చిరంజీవిని అన్నయ్య అంటూ ఎంతో అభిమానం చూపించే శ్రీకాంత్ అంటే చిరుకి కూడా ఎంతో అభిమానం. ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుల్లో శ్రీకాంత్ కూడా ఒకడని, తనకు తమ్ముడితో సమానం అంటూ అప్యాయం చూపిస్తుంటారు.
4/6
ఇక ఇద్దరు అన్నతమ్ముళ్లలా ఒకరిపై ఒకరు ఎప్పుడు అప్యాయత చూపించుకుంటారు. ఇప్పుడు చిరు మరోసారి శ్రీకాంత్‌పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. నేడు శ్రీకాంత్ బర్త్‌డే సందర్భంగా చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు.
5/6
ఇంటికి వెళ్లడమే కాదు తన వెంట స్పెషల్‌గా కేక్ కూడా తీసుకువెళ్లి శ్రీకాంత్ చేత కేక్ కట్ చేయించారు. అంతేకాదు కేక్ మీద "హ్యాపీ బర్త్‌డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య" అని స్పెషల్‌గా రాయించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ బర్త్‌డే సెలబ్రేట్ చేసి కాసేపు వారి కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు.
6/6
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. ఇక వీరిద్దరి సన్నిహితం, అనుబంధం చూసి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. కాగా వీరిద్దరూ కలిసి శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో కలిసి నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ వేసిన ATM పాత్ర బాగా హిట్ అయింది.
Published at : 23 Mar 2024 10:46 PM (IST)