Malaika Arora Photos: మలైకా న్యూ ఇయర్లో గుడ్ న్యూస్ చెబుతుందా!
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గత కొంత కాలంగా యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రతీ సారి ఓ వార్త హడావుడి చేస్తోంది కానీ దానిపై ఇద్దరూ ఏం స్పందించేవారు కాదు. తాజాగా తన పెళ్లి వార్తలపై హింట్ ఇచ్చింది మలైకా అరోరా...
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం మలైకా అరోరా 'మూవీంగ్ విత్ మలైకా' పేరుతో ఓ షోని నిర్వహిస్తోంది. ఈ షోలో మలైకా అరోరా వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ పరంగా కీలక విషయాల్ని వెల్లడించింది. అదే టైమ్ లో పెళ్లిగురించి కూడా చెప్పుకొచ్చింది.సోదరి అమృతా అరోరాతో జరిపిన ఫన్నీ డిస్కషన్లో మలైకా ఇలా స్పందించింది
తన తల్లి జోయిస్ అరోరా తనకు తమ ఫ్యామిలీ బ్యాంగిల్స్ ని కానుకగా ఇచ్చిందని చెప్పింది అమృత..దీనిపై రియాక్టైన మలైకా ... తను మా అమ్మకు ముద్దుల కూతురని చెప్పుకొచ్చింది. ఆ మాటలకు స్పందించిన అమృతా అరోరా ఆ బ్యాంగిల్స్ నీకూ కావాలా?.. కావాలంటే ఇచ్చేస్తానంది. ఇదే సందర్భంగా మలైకా అరోరా తన మ్యారేజ్ ప్లాన్ గురించి బయటపెట్టేసింది. మా ఇద్దరిలో మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం వున్న వాళ్లలో మొదటి వ్యక్తి ని నేనే అని క్లారిటీ ఇచ్చింది. దీంతో మలైకా అర్జున్ కపూర్ 2023 లో పెళ్లిచేసుకుంటారనే ప్రచారం మొదలైంది...
మలైకా అరోరా ( Image Credit/ Malaika Arora Instagram)
మలైకా అరోరా ( Image Credit/ Malaika Arora Instagram)
మలైకా అరోరా ( Image Credit/ Malaika Arora Instagram)