Yashmi Gowda : బిగ్‌బాస్ హౌజ్‌లో యశ్మీ గౌడ.. క్యూట్‌గా నవ్వేస్తూనే గట్టి పోటినిస్తున్న బ్యూటీ
బిగ్‌బాస్ హౌజ్‌లో క్యూట్‌గా నవ్వేస్తూ కనిపించింది యశ్మీ గౌడ. అలాగే టాస్క్‌లు వస్తే అంతే సీరియస్‌గా గేమ్ ఆడుతుంది.(Images Source : Instagram/Yashmi Gowda )
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో చీఫ్‌లలో ఒకరిగా ఉంది యశ్మీ. అయితే ఇదే నేపథ్యంలో బిగ్‌బాస్ చీఫ్‌లు క్లాన్స్ ఏర్పరచుకోవాలంటూ ఓ టాస్క్ ఇచ్చాడు.(Images Source : Instagram/Yashmi Gowda )
టాస్క్ ముందు వరకు నవ్వుతూ కనిపిస్తున్న ఈ భామ.. టాస్క్ ప్రారంభమయ్యే సరికి సీరియస్‌గా తీసుకుని గేమ్ ఆడుతుంది. తనదైన స్ట్రాటజీలతో టీమ్‌ని ముందుకు తీసుకెళ్తుంది. (Images Source : Instagram/Yashmi Gowda )
ప్రస్తుతం తన టీమ్‌లో ప్రేరణ, శేఖర్ బాష, నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. వీరితో తన గేమ్ స్ట్రాటజీలు డిస్కస్ చేసి.. ఎలా అయినా క్లాన్స్ మన సొంతంకావలని చెప్పింది.(Images Source : Instagram/Yashmi Gowda )
అలాగే ఇంట్లో ఎవరైనా తప్పు చేసినట్లు అనిపిస్తే వెంటనే అడుగుతుంది యశ్మీ. నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్లో వాష్ రూమ్ క్లీనింగ్‌పై మణికంఠను నిలదీసింది యశ్మీ.(Images Source : Instagram/Yashmi Gowda )
గేమ్‌లో అయితే తనదైన శైలితో మంచి స్టెబులిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఎలాంటి అనవసరమైన అటెన్షన్ గ్రాబ్ చేయకుండా.. అవసరమైనప్పుడు నోరు తెరుస్తూ మంచి పేరునే తెచ్చుకుంటుంది.(Images Source : Instagram/Yashmi Gowda )