Aarti Chabria Photos: ఫారెక్స్ బేబీగా ముద్దులొలికించింది , నువ్వే నాశ్వాస అంటూ మురిపించింది.. ఆర్తి గుర్తుందా..
ఆర్తి చాబ్రియా 1982, నవంబరు 21న ముంబైలో జన్మించింది. మూడు సంవత్సరాల వయసులోనే మెదటిసారిగా ఫారెక్స్ కు ప్రచారకర్తగా తన నటన మొదలుపెట్టింది. మ్యాగీ నూడుల్స్, పెప్సోడెంట్ టూత్ పేస్ట్, క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్, అమూల్ ఫ్రోస్టిక్ ఐస్ క్రీం, ఎల్.ఎం.ఎల్. ట్రెండీ స్కూటర్, క్రాక్ క్రీమ్, కళ్యాణ్ జ్యూవలరీ వంటి ఎన్నో ప్రకటనలలో నటించింది.
1999లో మిస్ ఇండియాగా ఎంపికయ్యింది ఆర్తి. మోడల్ గా వెలుగుతున్న సమయంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్తి చాబ్రియా.. ఒకరికి ఒకరు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, హిందీ, కన్నడ, పంజాబీ చిత్రాలలో నటించింది.
'ముంబై వారణాసి ఎక్స్‌ప్రెస్' అనే షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించింది. 2013 లో ''వ్యాహ్ 70కిలోమీటర్లు'' సినిమా తర్వాత వెండితెరకు దూరమైంది. 2019 జూన్ లో విశరధ్ బీడసీ అనే చార్టెడ్ అకౌంటర్ ని పెళ్లిచేసుకుంది.
ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్తి.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది...
ఆర్తి చాబ్రియా (Image Credit: Aarti Chabria / Instagram)
ఆర్తి చాబ్రియా (Image Credit: Aarti Chabria / Instagram)
ఆర్తి చాబ్రియా (Image Credit: Aarti Chabria / Instagram)
ఆర్తి చాబ్రియా (Image Credit: Aarti Chabria / Instagram)