Anupama as Lily : డీజే టిల్లుకి రాధిక కంటే లిల్లీనే గట్టి షాకే ఇచ్చేలా ఉందిగా.. అనుపమ లుక్ అలాగే ఉంది మరి
అనుపమ నీలిరంగు చీర కట్టుకుని.. చేతులకు నీలిరంగు గాజులు వేసుకుని.. పెద్ద పెద్ద ఝుంకాలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది. అందాన్ని రెట్టింపు చేసే చిన్న బొట్టు పెట్టుకుని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/anupamaparameswaran96)
డీజే టిల్లులోని లిల్లీ పాత్ర కోసం అనుపమ ఇలా ముస్తాబైంది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ ఫన్నీ క్యాప్షన్ కూడా పెట్టింది.(Images Source : Instagram/anupamaparameswaran96)
రేపు డీజే టిల్లు నుంచి ఓ మై లిల్లీ అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగానే అనుపమ ఈ ఫోటోలు షేర్ చేసింది. Lily in her vanity for one last time #ohmylily 💙 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/anupamaparameswaran96)
డీజే టిల్లు ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానిలో రాధిక క్యారెక్టర్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో టిల్లు, రాధికగా సిద్ధు, నేహా ఓ రేంజ్లో అలరించారు.(Images Source : Instagram/anupamaparameswaran96)
ఈ కల్ట్ సినిమాకు సీక్వేల్‌గా డీజే టిల్లు 2 ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాధిక పాత్రను లిల్లీ అనే పాత్రతో భర్తీ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్‌ను అనుపమ పోషిస్తుంది.(Images Source : Instagram/anupamaparameswaran96)
డీజే టిల్లులో సిద్ధు, నేహ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్లో వర్క్‌వుట్ అయి.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాలో సిద్ధూ, అనుపమ మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి? ప్రేక్షకులు వారిని ఆదరిస్తారో లేదో విడుదల తర్వాతే తెలుస్తుంది. (Images Source : Instagram/anupamaparameswaran96)