Naga Chaitanya: 'బంగార్రాజు' ప్రమోషన్స్.. నాగచైతన్య హ్యాండ్సమ్ లుక్..
సూపర్ డూపర్ హిట్ 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్ గా 'బంగార్రాజు' సినిమాను తెరకెక్కించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు.
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు.
ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చైతు.
'మనం' సినిమాలో నాన్న, తాతతో కలిసి యాక్ట్ చేసినప్పుడు కాస్త భయంగా ఉండేదని.. ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల 'బంగార్రాజు'లో అంతగా భయం అనిపించలేదని చెప్పారు.
ఇది పండుగ కోసం రెడీ చేసిన సినిమా అని.. నాన్న గారు మొదటి నుంచి అదే నమ్మకంతోనే ఉన్నారని చెప్పారు.
నాలుగేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చింది కానీ ఇద్దరి డేట్స్ అడ్జస్ట్ అయ్యేసరికి ఇంత టైం అయిందని.. బంగార్రాజును ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసేశామని తెలిపారు.