Adavallu Meeku Joharlu: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ఈవెంట్ లో శర్వా, రష్మిక ఫన్నీ పోజులు
యువ హీరో శర్వానంద్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' సినిమాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
కోవిడ్ కారణంగా ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.
ఈరోజు హైదరాబాద్ లో యూనిట్ మొత్తం ప్రెస్ మీట్ ను నిర్వహించగా.. అందులో శర్వానంద్, రష్మిక అందరూ పాల్గొన్నారు.
సినిమా విడుదలకు మరో పదిరోజులే ఉండడంతో ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ ప్రధాన పాత్రల్లో, 'వెన్నెల' కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ప్రెస్ మీట్ ఫొటోలు
'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ప్రెస్ మీట్ ఫొటోలు