Rashmika mandanna: ఎర్ర మందారంలా మెరిసిపోతున్న కన్నడ బ్యూటీ
కన్నడ భామ రష్మిక మందాన వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.
ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
గీత గోవిందం లాంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగునాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
దక్షిణాదిన సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది.
వికాస్ బహల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా విడుదలైన ‘గుడ్ బై’ ట్రైలర్ లో కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా అమితాబ్ బచ్చన్ కనిపించారు. రష్మిక కట్టుబాట్లు, ఆచారాలను పూర్తిగా వ్యతికేరించే కూతురిగా కనపడింది.
రష్మిక ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్నూ’ అనే సినిమాలో నటిస్తున్నది.
అనంతరం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ మూవీలో రణ్‌బీర్ కపూర్ సరసన నటిస్తోంది.