ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి ట్యాబ్‌ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక అందించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్ ట్యాబ్‌లు ఉచితంగా అందిస్తారు.
రూ. 16,500 కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి అందిస్తారు.
ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. 4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్ కంటెంట్ ఉచితంగా అందిస్తున్నారు.
ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్ లు పంపీణీ చేస్తారు.
ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్ధులకు ఆఫ్ లైన్‌లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 పాఠాలు అందుబాటులో ఉండేలా, 8,9 తరగతుల కంటెంట్ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్ చేశారు.