Shopping Rules: షాపింగ్ తర్వాత మొబైల్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేయవచ్చు
ఇప్పుడు చాలా షాపులలో బిల్లు చెల్లించడానికి ముందే కస్టమర్లను వారి మొబైల్ నంబర్ అడుగుతున్నారు. బిల్లు పంపడానికి లేదా భవిష్యత్తు అవసరాలు, ఆఫర్‌లను షేర్ చేయడానికి అని చెబుతున్నారు. అయితే షాప్ వాళ్లు అడిగితే మొబైల్ నంబర్ ఇవ్వాల్సిన అవసరరం లేదని మీకు తెలుసా?
వ్యక్తిగత ఫోన్ నంబర్ చెప్పడం ఒక ఆప్షన్ మాత్రమే అని చాలా మందికి తెలియదు. నెంబర్ వెల్లడించడం తప్పనిసరి కాదు. మీరు ఫోన్ నెంబర్ చెప్పకపోతే వస్తువు ఇవ్వడానికి షాపువాళ్లు నిరాకరించలేరు. మీ మొబైల్ నంబర్ ఇవ్వడం అంటే వ్యక్తిగత సమాచారం షేర్ చేసినట్లే.
మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం మీ గోప్యతకు భంగం కలిగించడమే. కనుక సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. మీరు షాపింగ్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ చెప్పకూడదు అనుకుంటారు. కానీ బిల్లింగ్ కౌంటర్ వద్ద ఫోన్ నెంబర్ చెప్పాలని పదే పదే అడుగుతారు. లేదా కొన్న వస్తువులను తిరిగి ఇవ్వాలని సైతం కొందరు అడుగుతారు.
భారతదేశంలో కస్టమర్ల హక్కులను కాపాడటానికి ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం మీ మొబైల్ నంబర్ చెప్పని కారణంగా దుకాణదారుడు మీకు సేవలను, వస్తువులను ఇవ్వడానికి నిరాకరించకూడదు. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే, మీరు ఫిర్యాదు చేయవచ్చు.
మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000 లేదా 1915కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా consumerhelpline.gov.in వెబ్‌సైట్ సందర్శించి, అందులో మీ సమస్యను తెలపవచ్చు. NCH యాప్ ద్వారా కూడా సైతం వినియోగదారులు తమ సమస్యను ఫిర్యాదు చేయవచ్చు.
ఏవైనా వస్తువులు కొనేందుకు వెళ్లిన సమయంలో మీ హక్కులను వినియోగించుకోండి. ఏదైనా స్టోర్, షాపులో మీ మొబైల్ నంబర్ ఇవ్వని కారణంగా మీకు ఆ వస్తువులుగానీ, సర్వీసులు గానీ ఇవ్వకపోతే ఏం సంకోచించకుండా ఫిర్యాదు చేయవచ్చు. దాంతో మీ ఆ సర్వీస్, వస్తువులు ఇవ్వడానికి నిరాకరించిన స్టోర్ యజమానికి చట్ట ప్రకారం శిక్ష పడుతుంది.