IRCTC Ticket Refund: రైలు రద్దైందా! ఈ లింక్ క్లిక్ చేస్తే టికెట్ డబ్బులు రీఫండ్ అవుతాయి!
ఇండియన్ రైల్వే! పేదోడి విమానంగా భావిస్తుంటారు. అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలు చేసేందుకు అనువైన రవాణా సాధనం ఇది! అందుకే చాలామంది ముందుగా ప్లాన్ చేసుకొని మరీ టికెట్లను రిజర్వు చేసుకుంటారు. కొన్నిసార్లు వాతావరణం బాగాలేకో, మరేదైనా కారణం వల్లో రైళ్లను రద్దు చేస్తుంటారు. అలాంటప్పుడు టికెట్ రీఫండ్ ఎలా పొందాలంటే?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాధారణంగా ఈ-టికెట్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఏ కారణం వల్లైనా రైళ్లను రద్దు చేస్తే రీఫండ్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా డబ్బులు బ్యాంకు ఖాతాలో పడతాయి. ఒకవేళ రైలు 3 గంటల కన్నా ఎక్కువ ఆలస్యమైతే, ప్రయాణించడం ఇష్టం లేకుంటే రైలు బయల్దేరేందుకు ముందుగానే టికెట్ డిపాజిట్ రిసిప్ట్ (TDR) దాఖలు చేయాలి.
టీడీఆర్ ఫైల్ చేసేందుకు మొదట ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో మై అకౌంట్ సెక్షన్‌కు వెళ్లి 'మై ట్రాన్‌జాక్షన్' ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఫైల్ టీడీఆర్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత https://www.operations.irctc.co.in/ctcan/SystemTktCanLogin.jsf లింక్‌ను ఓపెన్ చేయాలి.
మీ పీఎన్‌ఆర్ సంఖ్య, రైలు సంఖ్య, క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక క్యాన్సిలేషన్ నిబంధనల టిక్‌బాక్స్‌ను టిక్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ కొడితే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు మీ పీఎన్‌ఆర్ వివరాలు వస్తాయి.
పీఎన్‌ఆర్ వివరాలు వచ్చాక క్యాన్సిల్ టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎంత రీఫండ్ వస్తుందో తెరపై కనిపిస్తుంది. పీఎన్‌ఆర్ సమాచారంతో పాటు రీఫండ్ వివరాలను ధ్రువీకరిస్తూ మీ మొబైల్‌కు ఓ సందేశం వస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దైన రైళ్ల వివరాలను ఇండియన్ రైల్లే తమ వెబ్‌సైట్లో ఉంచుతుంది.