Apple Starts Hiring: ఉద్యోగాలు ఇస్తున్న యాపిల్ - త్వరలోనే ముంబయి, దిల్లీలో స్టోర్లు!
ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కంపెనీ యాపిల్! త్వరలోనే భారత్‌లో రిటైల్ స్టోర్లను తెరవబోతోందని సమాచారం. 2023లో మొదట ముంబయి, దిల్లీలో స్టోర్లను ఆరంభిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టు చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయాపిల్ ఇప్పటికే ఉద్యోగ నియామకాలు మొదలుపెట్టింది. చాలా శాఖల్లో ఉద్యోగులను నియమించుకుంటోంది. శుక్రవారం యాపిల్ కెరీర్ పేజ్‌లో భారత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 12 జాబ్ ప్రొఫైళ్లను పోస్టు చేసింది.
టెక్నికల్ స్పెషలిస్టు, బిజినెస్ ఎక్స్‌పర్ట్, సీనియర్ మేనేజర్, స్టోర్ లీడర్, జీనియస్ పోస్టులకు యాపిల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టింది. ఇవన్నీ రిటైల్ స్టోర్లకు అనుబంధంగా ఉన్న ప్రొఫైళ్లే కావడం గమనార్హం.
సాధారణంగా ఒక యాపిల్ స్టోర్‌లో కనీసం 100 మంది ఉద్యోగులు ఉంటారు. ఇక ప్రధాన కేంద్రాల్లో 1000 మంది వరకు పనిచేస్తుంటారు. యాపిల్‌లోని 'మార్కెట్ లీడర్' పొజిషన్లో ఉన్నవారు దేశ వ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్లు, టీమ్‌లను సమన్వయం చేస్తుంటారు.
యాపిల్ కంపెనీ తమను నియమించుకొందని ఇప్పటికే కొందరు లింక్డ్‌ఇన్‌లో పోస్టు చేశారు. త్వరలో ఆరంభించే స్టోర్ల కోసమే తమను తీసుకున్నారని చెప్పారు. ఒకరు 'లీడ్ జీనియస్', మరొకరు 'సీనియర్ మేనేజర్' ఉద్యోగాలు ఎంపికయ్యామని ప్రకటించారు.