ఇన్నొవేటివ్ డిజైన్‌తో వచ్చేసిన టెస్లా సైబర్ ట్రక్ - మస్క్ మామ ఎంత రేటు ఫిక్స్ చేశాడంటే?
ABP Desam | 02 Dec 2023 05:49 PM (IST)
1
టెస్లా నుంచి వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైబర్‌ట్రక్ ధరను ఎట్టకేలకు ఎలాన్ మస్క్ ప్రకటించాడు.
2
టెస్లా సైబర్ ట్రక్ ధర $60,990 (సుమారు రూ. 51 లక్షలు) నుంచి ప్రారంభం కానుంది.
3
2019లో సీఈవో ఎలాన్ మస్క్ పేర్కొన్న అంచనా ధర కంటే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ.
4
ప్రస్తుతానికి ఎంపిక చేసిన కస్టమర్‌లకు మాత్రమే టెస్లా సైబర్‌ట్రక్ అందుబాటులో ఉంటుంది.
5
ఇందులో మూడు వేరియంట్‌లు ఉన్నాయని తెలుస్తోంది. వీటి ధర రూ.51 లక్షల నుంచి రూ. 83 లక్షల మధ్య నిర్ణయించనున్నారు.
6
తన సైబర్‌ట్రక్‌ను సాధారణ ట్రక్కు కంటే మెరుగైనదని, స్పోర్ట్స్ కారు కంటే వేగవంతమైనదని ఎలాన్ మస్క్ తెలిపాడు.
7
టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది కస్టమర్‌లకు దానిని అందించాడు కూడా.
8
ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్ అని ఎలాన్ మస్క్ తెలిపాడు.