గురువు నక్షత్రంలో సూర్యుని సంచారం! ఈ 3 రాశుల ఉద్యోగులు శుభవార్త వింటారు!
నవంబర్ నెలలో రాశి మారడానికి ముందు సూర్యుడు నక్షత్రం మారబోతున్నాడు. సూర్యుడు గురువు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచరిస్తాడు. ఫలితంగా సూర్యుడు మూడు రాశులకు శుభాన్నిస్తాడు
గ్రహాల అధిపతి సూర్యుని గమనంలో మార్పులు జరిగినప్పుడల్లా దేశం, ప్రపంచం, వాతావరణం .. రాశులపై కూడా ప్రభావం చూపుతుంది. కార్తీక పూర్ణిమ తర్వాత నవంబర్ 6న మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాలకు సూర్యుడు స్వాతి నుంచి విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. అంతేకాకుండా ఈ నక్షత్రానికి తుల , వృశ్చిక రాశులతో సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నక్షత్రంలో సూర్యుడు కొన్ని రాశులకు మేలు చేస్తాడు. ఈ శుభ రాశుల గురించి తెలుసుకోండి.
నక్షత్ర మార్పుతో సూర్యుడు మేష రాశి వారి జీవితాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాడు. ఉద్యోగ వ్యాపారాలలో వేగం పెరుగుతుంది .. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో కార్యాలయంలో కొత్త బాధ్యత లేదా ఉన్నత పదవి కూడా లభించవచ్చు.
సూర్యుని నక్షత్ర మార్పు సంహరాశివారికి లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడు మీ రాశికి అధిపతి, కాబట్టి విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించడం ద్వారా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సమయంలో ఒక్కొక్కటిగా మీ సమస్యలు పరిష్కారమవుతాయి
వృశ్చిక రాశి సూర్యుని నక్షత్ర సంచారం మీకు కూడా శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. అప్పులు .. చట్టపరమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది..మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.