✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

మీరు పుట్టిన తేదీ ప్రకారం మీలో మార్చుకోవాల్సిన లక్షణం ఇదే!

RAMA   |  14 Oct 2025 10:09 AM (IST)
1

సంఖ్యాశాస్త్రం ప్రకారం...మీ పుట్టిన తేదీ 1 (1, 10, 19, 28) అయితే..మీరు అహంకారంతో స్పందించకూడదు. అలా చేయడం వల్ల మీకు నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా మీరు ఎవరికి అప్పు ఇచ్చినా తిరిగి రావడం కష్టమే. న్యూమరాలజీ ప్రకారం 1కి సూర్యుడు అధిపతి.

Continues below advertisement
2

సంఖ్యాశాస్త్రంలో ఎవరైతే 2, 11, 20, 29 తేదీల్లో జన్మించారో వారు అతిగా భావోద్వేగాలకు గురికాకుండా ఉండాలి. ఒంటరి ప్రయాణాలు లేదా భావోద్వేగాలను రేకెత్తించే విషయాలకు దూరంగా ఉండాలి. చంద్రుడు మీ గ్రహాధిపతి.

Continues below advertisement
3

మూలాంకం 3 (3, 12, 21, 30) ఉన్నవారికి గురు గ్రహం అధిపతి. మూలాంకం 3 ఉన్నవారు ఎవరితోనైనా అహంకారంతో మాట్లాడకుండా ఉండాలి. చిన్న పిల్లలు, పెద్దవారితో ప్రేమగా ఉండండి.

4

మూలాంకం 4 (4, 13, 22, 31) వారి గ్రహ అధిపతి రాహువు. మూలాంకం 4 గలవారికి ఇదే సలహా, డబ్బు విషయంలో తొందరపాటు చూపించవద్దు. పనిలో షార్ట్ కట్ లు తీసుకోకుండా ఉండండి. ఎవరి మనోభావాలను దెబ్బ తీయకుండా ఉండండి.

5

మూలాంకం 5 (5,14,23) గల వారి గ్రహాధిపతి బుధుడు. మూలాంకం 5 గల వారికి ఇదే సలహా, ఎవరితోనైనా అనవసరంగా వాదించకుండా ఉండండి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ధ్యానం , పుస్తకాలు చదవడం లాభదాయకంగా ఉంటుంది.

6

న్యూమరాలజీ ప్రకారం మీరు జన్మించిన నంబర్ 6 (6,15,24) అయితే మీకు శుక్రుడు గ్రహాధిపతి. ఈ వ్యక్తులు తమ జీవితంలో ప్రదర్శనలకు దూరంగా ఉండాలి. మీరు ఎల్లప్పుడూ నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వాలి.

7

7,16,25 తేదీల్లో జన్మించిన వారి గ్రహ అధిపతి కేతువు. ఆత్మచింతనతో పాటు డైరీ రాయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అవసరం లేనప్పుడు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

8

8, 17,26 తేదీల్లో జన్మించిన వారి అధిపతి శని. న్యాయం కర్మతో సంబంధం కలిగి ఉంటాడు. అందువల్ల ఈ తేదీల్లో జన్మించినవారు కష్టపడి పనిచేయడానికి వెనుకాడకూడదు. వృద్ధులకు సేవ చేయాలి.

9

న్యూమరాలజీ ప్రకారం 9, 18,27 తేదీల్లో జన్మించినవారికి అధిపతి కుజుడు. వీరు కోపం అదుపులో ఉంచుకోవాలి. కోపంతో ఎవరితోనూ వాదించకుండా ఉండాలి. అంతేకాకుండా ప్రతిరోజూ సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మీకు శుభప్రదం.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • శుభసమయం
  • మీరు పుట్టిన తేదీ ప్రకారం మీలో మార్చుకోవాల్సిన లక్షణం ఇదే!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.