Numerology: గోవిందా, ధర్మేంద్ర ఆరోగ్యంపై '3' ప్రభావం! ఇది బృహస్పతి హెచ్చరికా?
సినీ ప్రపంచానికి చెందిన ఇద్దరు నటులు గోవిందా , ధర్మేంద్ర ఇద్దరూ ఒకే సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. దీనిని సంఖ్యాశాస్త్రానికి ముడిపెట్టి చూస్తున్నారు నిపుణులు
గోవిందా ఆరోగ్యం క్షీణించడంతో నవంబర్ 12 రాత్రి ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. గోవిందా పుట్టిన తేదీ డిసెంబర్ 21 1963. కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆయన మూల్యాంకం 3 అవుతుంది
ధర్మేంద్ర ఆరోగ్యం నవంబర్ 10న క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేర్పించారు. నవంబర్ 12 (1+2=3) మరియు నవంబర్ 10 (1+0=1) రెండూ కూడా గురు గ్రహానికి సంబంధించిన సంఖ్యలు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, 3వ సంఖ్యకు అధిపతి బృహస్పతి (గురుడు), 1వ సంఖ్యకు అధిపతి సూర్యుడు.
సూర్యుడు , బృహస్పతి రెండూ సంయమనం.. శక్తి.. జ్ఞానం .. జీవశక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. బాలీవుడ్ నటుడు గోవిందా , ధర్మేంద్ర సంఘటనలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇది గురు గ్రహ హెచ్చరికలా అనిపిస్తుంది. బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి ఎక్కువ శ్రమ, అలసట లేదా అధిక వ్యాయామం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.
గోవిందా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'అధికంగా వ్యాయామం చేయడం వల్ల ఇది జరిగింది' అని చెప్పారు. అంటే సంఖ్యాశాస్త్రం చెబుతున్నది ఇదే అంటున్నారు నిపుణులు.
గురుడు జ్ఞానం లేదా ధనం కారకుడు మాత్రమే కాదు..ఆత్మ నియంత్రణకు కూడా కారకుడుగా పరిగణిస్తారు. గురు గ్రహం అలసట లేదా అసమతుల్యత గురించి తెలియజేసినప్పుడు, దాని పరిష్కారాన్ని కూడా అందిస్తాడు. గోవిందా కోలుకున్న తర్వాత తన అభిమానులకు 'యోగా, ప్రాణాయామం చేయండి సమతుల్య జీవితాన్ని గడపండి' అని సలహా ఇచ్చారు