న్యూమరాలజీ ప్రకారం మీ నంబర్ 3 అయితే.. 2026 మీకు మామూలుగా లేదుగా!
సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 నుండి 9 వరకు మూలాంకం ఉన్నవారికి నూతన సంవత్సరం వివిధ రకాలుగా ఫలవంతంగా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 3 ఉన్నవారికి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 3, 12, 21 లేదా 30 తేదీలలో జన్మించిన వారి నంబర్ 3 అవుతుంది. 2026 సంవత్సరం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది.
సంఖ్యాశాస్త్రం ప్రకారం నంబర్ 3 గురువు సంఖ్యగా పరిగణిస్తారు, ఇది విద్య, నాయకత్వం, జ్ఞానం , ఆధ్యాత్మికతకు కారకంగా కూడా పరిగణిస్తారు. 2026లో వీరిపై గురువు ప్రత్యేక ప్రభావం ఉంటుంది
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026 సూర్యుని సంఖ్య అవుతుంది. అదే సమయంలో 3 మూలాంకంపై గురువు ప్రభావం ఉంటుంది. సూర్యుడు, గురువు ఇద్దరూ మిత్ర గ్రహాలు. ఇలాంటప్పుడు సూర్యుడు .. గురువుల అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో అదృష్టం ప్రకాశించనుంది.
వృత్తి వ్యాపార పరంగా 3 నంబర్ వారికి 2026 సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు వ్యాపారంలో ఉంటే మంచి లాభం పొందవచ్చు. అదే సమయంలో ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతాల పెంపు లేదా కోరుకున్న బదిలీలు లభించవచ్చు. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది.
ప్రేమ జీవితానికి సంబంధించి కొత్త సంవత్సరం మీకు చాలా ఇవ్వబోతోంది. మూలాంకం 3 కలిగిన వివాహం చేసుకోవడానికి అర్హులైన వారు ఈ సంవత్సరం వివాహ బంధంలోకి ప్రవేశించవచ్చు, వైవాహిక జీవితం ఉన్న వ్యక్తుల మధ్య అనుబంధం బలపడుతుంది
కొత్త సంవత్సరం 2026లో మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉండబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన లేదా రావాల్సిన ధనం ఈ సంవత్సరం మీకు లభించవచ్చు. భూమి ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా పరిష్కారమవుతాయి