In Pics : ఆటో నడిపిన సీఎం జగన్, విశాఖలో వాహన మిత్ర లబ్దిదారులకు చెక్కులు అందజేత
విశాఖపట్నం పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో వాహన మిత్ర చెక్కులను కొందరు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
వైఎస్సార్ వాహనమిత్ర పథకం 2022–23 లబ్ధిదారులకు ఖాతాల్లో రూ. 10 వేలు జమ అయ్యాయి.
విశాఖ పర్యటలో భాగంగా అక్కడి పోలీసు అధికారులతో సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వాహన మిత్ర లబ్దిదారులకు చెక్కులను అందించారు.
వాహన మిత్ర లబ్దిదారులకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం
విశాఖలో సీఎం జగన్
విశాఖలో వాహన మిత్ర పథకం కింద నాలుగో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో సొంత ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా దాదాపు 2,61,516 మంది అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
ఆటో నడిపిన సీఎం జగన్
ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగో విడతగా వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
వాహన మిత్ర లబ్దిదారులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో నాలుగో విడతలో రూ.261.51 కోట్ల వరకు జమ చేయనున్నారు.
ఇప్పటివరకు మూడుసార్లు (2019–20, 2020–21, 2021–22) వైఎస్ఆర్ వాహనమిత్ర (YSR Vahana Mitra) పథకం కింద ఆర్థిక సహాయం చేశారు.
ఈ నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది.