In Pics : రేపటి నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
రేపటి నుంచి తిరుమలలో కన్నుల పండుగగా పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యాన వనంలోని పరిణయ మండపాన్ని టీటీడీ ఎంతో సుందరంగా తీర్చి దిద్దుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా సెట్ ను నిర్మించి వివిధ రకాల పుష్పాలు, పండ్లతో ఆలంకరించి పరిణయోత్సవ వేదికన ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శ్రీనివాసుడి వివాహ మహోత్సం భక్తులను కనువిందు చేయనున్నది.
పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఇప్పటికే నారాయణగిరి ఉద్యాణవనంలోని కళ్యాణ వేదికను సుందరంగా అలంకరించింది.
శ్రీనివాసుడి వివాహ మహోత్సవాన్ని వివరించేదే పద్మావతి పరిణయోత్సవం వేడుకలు ప్రతి యేటా వైశాఖ శుద్ద దశమి మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా టీటీడీ నిర్వహిస్తుంది.
ఈ ఏడాది నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయ మండప వేదికను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. బంగారు కాంతులతో దగాదగా మెరిసే విధంగా బంగారు వర్ణంతో పరిణయోత్సవ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు దేశవిదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు, వివిధ రకాల పండ్లతో మండపంతో పాటుగా, పరిణయ పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు.
వేదిక పరిసరాలలో ఏర్పాటు చేసిన పలు కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు పరిణయ వేదికతో పాటు శ్రీవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దేదీపమాన్యంగా అలంకరించారు.
మూడు రోజుల పాటు జరిగే శ్రీనివాసుడిని పరిణయ మహోత్సవం భక్తులను కనువిందు చేయనుంది. ఈ వివాహ తంతు ప్రక్రియను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు టీటీడీ అధికారులు.
పరిణయోత్సవ వేడుకలను పురస్కరించుకొని టీటీడీ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహాస్ర దీపాలంకరణ సేవలను మూడు రోజుల పాటు రద్దు చేసింది.
బంగారు కాంతులతో దగాదగా మెరిసే విధంగా బంగారు వర్ణంతో పరిణయోత్సవ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు దేశవిదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు, వివిధ రకాల పండ్లతో మండపంతో పాటుగా, పరిణయ పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ ఏడాది నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయ మండప వేదికను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.
ఈ ఏడాది నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయ మండప వేదికను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.