Tirumala: తిరుమలలో వైభవంగా వార్షిక తెప్పోత్సవాలు
తెప్పపై శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి కటాక్షం..
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను కటాక్షించారు.
పాల్గున శుద్ద ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు శ్రీవారికి తెప్పోత్సవాలు
మూడోవ రోజు సాయంత్రం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.
విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు..
వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి నాలుగో రోజు ఐదు చుట్లు, చివరి రోజు ఏడు చుట్లు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.