In Pics : తిరుమలలో తోపులాట, క్యూలైన్లలో భక్తుల అవస్థలు
తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తోపులాట చోటుచేసుకుంది. (Source : Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచిచూస్తున్నారు. ఈరోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భక్తులు చిన్నపిల్లలతో క్యూలైన్లలో అవస్థలు పడ్డారు. (Source : Twitter)
స్పృహ తప్పిపోయిన భక్తురాలికి సపర్యలు చేస్తున్న బంధువు (Source : Twitter)
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కేటాయించే కేంద్రాలు వద్ద భక్తులను అదుపు చేయలేక టీటీడీ చేతులు ఎత్తేసింది. అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకోవడంతో దర్శనం టిక్కెట్లు లేకపోయినా భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది. (Source : Twitter)
చిన్నారితో క్యూలైన్ లో ఇబ్బందులు పడుతున్న భక్తులు (Source : Twitter)
క్యూలైన్ తోపులాటలో గాయపడిన వృద్ధురాలు (Source : Twitter)
నిన్న అర్ధరాత్రి నుండి స్వామి వారి సర్వదర్శనం టోకెన్ కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. పాఠశాలలకు మధ్యాహ్నం సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. (Source : Twitter)
రెండు రోజుల విరామం అనంతరం తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్లు పంపిణీ చేశారు. గోవిందరాజస్వామి సత్రం వద్దకు వేచి ఉన్న భక్తులతో పాటు నేడు వచ్చిన భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లలో తోపులాట జరిగింది. (Source : ANI Twitter)
తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తోపులాట చోటుచేసుకుంది. Source : ANI Twitter)