Mahanadu 2025: కార్యకర్తల్లో ఒకడై... అధినేతకు అన్నీ తానే- కడప మహానాడులో ప్రతేక ఆకర్షణగా లోకేష్ కటౌట్
కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
కార్యక్రమం జరిగిన మొదటి రోజు నుంచి కార్యకర్తలతో కలిసిపోతూ అధినేత చెప్పిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
అందుకే లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పంగించాలని పార్టీ నేతలంతా తమ ప్రసంగాల్లో బహిరంగంగానే తెలిపారు.
తొలి రోజు ఆరు తీర్మానాలు ప్రవేశ పెట్టి కార్యకర్తల మనసు దోచుకున్నారు లోకేష్
ఐదేళ్లు వైసీపీ వేధింపులను ఎదుర్కొని పార్టీ జెండాను రెపరెపలాడించిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు.
అన్నింటి కంటే ముఖ్యంగా గత మహానాడు సందర్భంగా సైకిల్ యాత్ర చేసిన కొందరు టీడీపీ కార్యకర్తలను పెద్దిరెడ్డి అనుచరులు తమ ఊరిలో కొట్టాడు. టీడీపీ జెండా కనిపించకూడదని వారి బట్టలు విప్పి నిలబెట్టారు.
అవమానం జరిగిన ప్రాంతం నుంచే సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రత్యేకంగా కలిశారు లోకేష్
యువగళం పాదయాత్ర గురించి ఆసక్తికరమైన వివరాలు తెలియజేస్తూ రాసిన పుస్తకాన్ని చంద్రబాబుకు అందజేశారు లోకేష్
పాదయాత్ర పుస్తకంలో ఉన్న అనేక కథలు తనను వెనక్కి తీసుకెళ్లాయని లోకేష్ గుర్తు చేసుకున్నారు.
తనను బాధ్యతగల నాయకుడిగా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, కార్యకర్తల ఈ ప్రయాణాన్ని ప్రేమతో అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.