అన్వేషించండి

Chandrababu Singapore Tour: సింగపూర్‌ పర్యటనలో చంద్రబాబు.. ఏపీలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటలిస్టులకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు

1/5
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో పాటు సింగపూర్‌కు చెందిన పలువురు ప్రముఖ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు.

2/5
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడు నిద్రిస్తున్న ప్రాంతం కాదని, విప్లవాత్మక సంస్కరణలతో ప్రపంచంలోనే దూసుకుపోతున్న ఒక అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి నేతృత్వంలో దేశం అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. చైనా వంటి దేశాలు ఆర్థిక వృద్ధి సాధించడానికి దశాబ్దాల కాలం పట్టిందని, కానీ భారత్‌కు అంత సమయం పట్టడం లేదని ఆయన విశ్లేషించారు.

3/5
ప్రస్తుతం మెడికల్ టెక్నాలజీతో పాటు ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన భారత్ నుంచి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ పరికరాలు భారీగా ఎగుమతి అవుతున్నాయని, ఐదో తరం యుద్ధ విమానాల తయారీ సహా అత్యుత్తమ రక్షణ, పారిశ్రామిక ఉత్పత్తులు దేశంలోనే తయారవుతున్నాయని వెల్లడించారు. భారత్‌కు ఉన్న అతిపెద్ద బలం ఇక్కడి ‘డెమోగ్రాఫిక్ డివిడెంట్’ అని, ప్రపంచంలోనే మరే దేశానికి లేని విధంగా అతిపెద్ద యువశక్తి కలిగిన మానవ వనరులు భారత్ సొంతమని అన్నారు. ఈ మానవ వనరులను సమర్థవంతంగా వాడుకుంటూ, తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్‌లో తాము ‘వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్’ (ఇంటికో పారిశ్రామికవేత్త) అనే వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.

4/5
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించారు. భూ సమీకరణ అనే విధానం ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిని సైతం ఇదే ల్యాండ్ పూలింగ్ ప్రాతిపదికన నిర్మిస్తున్నామని వెల్లడించారు. పారిశ్రామిక సానుకూల విధానాల వల్లనే ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు అత్యంత వేగంగా అనుమతులు ఇచ్చి భూములు కేటాయించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే అత్యంత సరైన సమయమని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో ఉన్న ‘శ్రీసిటీ’ లాంటి ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.

5/5
రాష్ట్రంలో పౌర సేవలతో పాటు పాలనాపరమైన అన్ని అంశాలకూ అత్యాధునిక టెక్నాలజీని అనుసంధానించామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యువతలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేస్తున్న ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడిందని పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటలిస్టులు ఈ హబ్ ద్వారా వచ్చే సరికొత్త స్టార్టప్‌లకు ఆర్థిక తోడ్పాటు, పెట్టుబడులు అందించేందుకు భారీగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ సాంకేతిక, వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి వెంచర్ క్యాపిటలిస్టులు ఉత్సాహంతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు-  గుడివాడ గడ్డపై నుండి  చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్  బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు-  గుడివాడ గడ్డపై నుండి  చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే

Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Embed widget