✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

TDP Manifesto 2024: ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో 2024 - సూపర్ సిక్స్‌తో పాటు మరిన్ని సంక్షేమ పథకాల ప్రకటన

Shankar Dukanam Updated at: 30 Apr 2024 06:46 PM (IST)
1

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రజాగళం మేనిఫెస్టో ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను ప్రకటించగా, మరిన్ని జోడించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

మేనిఫెస్టోలో హైలైట్ సూపర్ సిక్స్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం. ప్రతి మహిళకి నెలకు రూ. 1500 (19 సం॥ నుంచి 59 సం వరకు). ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించడం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ 2.0 / షణ్ముఖ వ్యూహం ఇంటింటికీ రక్షిత తాగునీరు: ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్ (14) పథకాలు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సిన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచడం. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉండటం

3

యువత సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పన, ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణం, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి, అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఉచిత నివాస స్థలం ఇవ్వనున్నట్లు ఎన్డీఏ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మెగా డియస్సీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్. ఉత్తరాంధ్ర కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ల ఏర్పాటు. అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహకాలు మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునఃప్రారంభం-విస్తరణ. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించడం.

Continues below advertisement
4

బీసీ డిక్లరేషన్ కింద.. 50 ఏళ్లకే నెలకు నాలుగవేల రూపాయలు పింఛన్లు ఇవ్వడం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడం. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షా 50 వేలు కోట్లు ఖర్చు చేస్తామని హామీ. స్థానిక సంస్థల నామినేటెడ్‌ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ రావడానికి కృషి చేస్తాం బీసీ కులాల దామాషా ప్రకారం కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇస్తామన్నారు. స్వయం ఉపాధి కోసం ప్రతి ఏటా పదివేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆదరణ కింద ఐదు వేల కోట్లు ఖర్చు- ఆధునిక పనిముట్లు అప్పగిస్తామన్నారు. వారసత్వ వృత్తిపై ఆధార పడే వాళ్లకు ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఆధునీకరణలో వారిని ఇన్వాల్వ్‌ చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

5

కాపు సంక్షేమ కోసం 15వేల కోట్లు ఖర్చు చేయడం. కాపు యువతకు, మహిళలు స్వయం ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తామని మేనిఫెస్టో హామీ. అగ్రవర్ణాల్లో ఉన్న పేదల ఉన్నతి కోసం ప్రయత్నం చేయడం. ఏప్రిల్ నుంచి వృద్ధులకు 4000 పింఛన్లు, దివ్యాంగులకు ఆరువేలు, చూపు పూర్తిగా లేని వారికి 15 వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నారు. కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు 10వేల పింఛన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

6

ఏపీలో వివాదాస్పదం అవుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్నారు. పోలవరం, గాలేరు నగరి, హంద్రీ నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టు, నిర్వాయర్ల పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా పథకం కింద సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • TDP Manifesto 2024: ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో 2024 - సూపర్ సిక్స్‌తో పాటు మరిన్ని సంక్షేమ పథకాల ప్రకటన
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.