In Pics: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.
మైలవరం జలాశయాన్ని, వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు.
కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం మట్టికట్ట తెగిపోవడంతో రాజంపేట నియోజకవర్గంలో చాలా గ్రామాలు నీట మునిగాయి.
చెయ్యేరు నదికి భారీ వరద
సీఎం జగన్ ఏరియల్ సర్వే
వరద బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు
వరద ప్రభావంతో నీట మునిగిన ఇళ్లు, భారీగా ఆస్తి, పంట నష్టం
పూర్తిగా నీట మునిగిన అన్నమయ్య డ్యాం పరిసర ప్రాంతాలు
సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి వరద ప్రభావిత ప్రాంతాల వివరాలు తెలుపుతున్న అధికారులు
కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ అధికారులతో కలిసి ఏరియల్ సర్వే చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం... అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమయ్యారు.