In Pics: అనంతపురంలో పోలీసుల జులుం.. విద్యార్థులపై లాఠీచార్జీ, పలువురికి గాయాలు
ABP Desam | 08 Nov 2021 12:21 PM (IST)
1
విద్యార్థి సంఘాలు అనంతపురంలో ఆందోళన బాట పట్టాయి. ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
2
ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ, స్కూల్ విలీన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
3
యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరించింది. దీంతో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు.
4
ఈ క్రమంలో తోపులాటలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొంత మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.