వివేకా హత్య కేసులో నేడు సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం ౩ గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాశ్‌ రెడ్డిని అడిగే ప్రశ్నలు ఏంటి ఎంతటైం ప్రశ్నిస్తారు.. మళ్లీ రమ్మంటారా అనేది ఇప్పుడు సస్పెన్ష్‌గా మారింది. వైసీపీ నేతలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఎపిసోడ్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. 


వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకు చాలా మందిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వాళ్లంతా చాలా సామాన్యులు, ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేనోళ్లు. ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఓ ప్రజా ప్రతినిధిని సీబీఐ విచారిస్తోంది. అందుకే ఈ విచారణ తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తోంది. అందులోనూ అవినాష్‌ రెడ్డి సీఎం జగన్‌కు సోదరడి వరుస అవుతారు. ఈయనపై వివేకా కుమార్తె సునీత కూడా అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసులో ఈయనతోపాటు వాళ్ల నాన్న పాత్ర ఉందని మొదటి నుంచి నమ్ముతున్నారు. 


ఇన్నాళ్లు చాలా స్లోగా సాగిన సీబీఐ దర్యాప్తు తెలంగాణ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి స్పీడ్ అందుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో అవినాష్ రెడ్డిని పిలుస్తారు. విచారరిస్తారన్ని ప్రచారం జరుగుతున్నా ఇన్నాళ్లకు ఆయన్ని పిలిచి విచారిస్తున్నారు. కేసులో ఇకపైనా అయినా నిజాలు నిగ్గు తేలాలని కుటుంబ సభ్యులతోపాటు చాలామంది కోరుకుంటున్నారు.  


ఆంధ్రప్రదేశ్‌లో దర్యాప్తు సాగినన్నాళ్లు... సీబీఐ అధికారులపై అధికార పక్షం వైసీపీ ఒత్తిడి తీసుకు వచ్చిదని అందుకే దర్యాప్తు చాలా ఆలస్యంగా జరిగిందని ప్రతిపక్షాలతోపాాటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. అందుకే సునీత కోర్టులో పిటిషన్ వేసి... ఏపీల నుంచి దర్యాప్తును వేరే రాష్ట్రానికి  మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తెలంగాణ నుంచి దర్యాప్తు కొనసాగాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణలో దర్యాప్తు ప్రారంభమైన తొలి విడతలోనే అవినాష్‌ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. 


మొదటి నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు తర్వాత రోజే విచారణకు రమ్మమన్నారు. అంటే జనవరి 24న నోటీసులు జారీ చేసిన అధికారులు జనవరి 25న విచారణ రావాలని పిలుపునిచ్చారు. అయితే తనకు ముందస్తుగా నిర్ణయించు షెడ్యూళ్లు ప్రకారం చాలా పనులు ఉన్నాయని చెప్పారు. ఐదు రోజల పాటు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు సమాధానం ఇచ్చారు.


అవినాష్‌ రెడ్డి వివరణ పరిగణలోకి తీసుకున్న సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 28వ తేదీ న అంటే ఇవాళ(శనివారం) విచారణ హజరుకావాలని ఆదేశించారు. ఇవాళ మూడు గంటల నుంచి హైదరాబాద్‌లో విచారణ చేయనున్నారు సీబీఐ అధికారులు. ఈ విచారణ ఇంకా ఎన్ని మలుపులు తిరగనుంది... సీబీఐ ఇంకా ఎలాాంటి ట్విస్ట్‌లు ఇవ్వబోతుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. 


వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తుపై మొన్నీ మధ్య తొలిసారిగా స్పందించిన ఎంపీ అవినాష్‌ రెడ్డి... తనను అనవరంగా వేధిస్తున్నారని అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని అన్నారు. తనపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తన గురించి, తన వ్యవహార శైలి ఏంటో ఈ జిల్లా ప్రజలు అందరికీ బాగా తెలుసని అన్నారు. ‘‘న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలి అన్నదే నా ధ్యేయం. నిజం తేలాలని నేను కూడా భగవంతుడిని కోరుకుంటున్నా. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించాలి ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండి’’ అని అన్నారు.