YouTuber Ranveer Allahbadia Crass Remarks Draw A Warning From D Fadnavis: రణవీర్ అల్లాబడియా ఇప్పుడు అల్లాడిపోతున్నాడు. ఆయన ఎవరో దక్షిణాది వారికి పెద్దగా తెలియదు కానీ.. కుళ్లు జోకులను ఇష్టపడే హిందీ యూట్యూబ్ ప్రేక్షలకు బాగా తెలుసు. ఆయన ఇటీవల తన తోటి యూట్యూబర్లతో ఓ చర్చా కార్యక్రమం పెట్టుకున్నాడు. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా గీత దాటితో తాడ తీస్తామని హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది.
ఇంతకీ ఈ రణవీర్ అల్లాబడియా ఏమన్నారు ?.
"నీ జీవితాంతం ప్రతిరోజూ నీ తల్లిదండ్రులు శృంగారం చేయడం చూస్తావా లేదా ఒక్కసారి అందులో చేరి శాశ్వతంగా ఆపేస్తావా?" అని తన తోటి యూట్యబర్ ను ప్రశ్నించారు. ఇదేదో పెద్ద జోక్ అయినట్లుగా మిగతా ముగ్గురు కూడా పగలబడి నవ్వారు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. దాంతో పాటు నెటిజన్లు కూడా విరుచుకుపడుతున్నారు.
రణవీర్ అల్లా బడియా తల్లిదండ్రులను అవమానిస్తున్నారని ఎక్కువ మంది మండిపడుతున్నారు.
ఇలాంటి యూట్యూబర్లపై కఠిన చర్యుల తీసుకోవాలని అంటున్నారు.
కొద్ది రోజుల కిదంట.. తెలుగుకు చెందిన కొంత మంది యూట్యూబర్లు చిన్న పిల్ల, ఓ తండ్రి విషయంలో చేసిన కామెంట్లు కూడా ఇంత కన్నా ఘోరంగా ఉండటంతో అరెస్టు చేశారు. అప్పుడు సినీ ప్రముఖలుంతా తమ వాయిస్ వినిపించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది.