Zookeeper eaten alive by pack of lions : థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని సఫారీ వరల్డ్ జూలో సింహాల దాడిలో జూకీపర్ జియాన్ మృతి చెందారు. తర్వాత సింహాలు ఆయనను తినేశాయి. పర్యాటకులు కార్ల హారన్లు మోగించి, అరవడం ద్వారా సింహాలను ఆపడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది
బ్యాంకాక్‌లోని ఖ్లాంగ్ సామ్ వా జిల్లాలో ఉన్న సఫారీ వరల్డ్ జూ ఆసియాలో అతిపెద్ద ఓపెన్-ఎయిర్ జూలలో ఒకటి. సింహాలు, పులుల ఫీడింగ్ ట్రిప్‌లు ఈ జూలో ప్రత్యేకత. ఈ జూ డ్రైవ్-త్రూ జోన్‌లో, పర్యాటకులు తమ వాహనాల నుంచి జంతువులను చూడవచ్చు, కానీ బయటకు రాకూడదని కఠిన నిబంధనలు ఉన్నాయి.
జియాన్ రంగ్‌ఖరసమీ, 58 ఏళ్ల సీనియర్ జూకీపర్, సూపర్‌వైజర్, సఫారీ వరల్డ్‌లో 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. సింహాలకు ఆహారం పెట్టే బాధ్యత తీసుకుంటాడు. ఘటన రోజు, అతను తన వాహనం నుంచి బయటకు దిగి, ఒక వస్తువును తీసుకోవడానికి వంగాడు. ఈ సమయంలో, సుమారు 10 మీటర్ల దూరంలో ఉన్న సింహం అతని వెనుక నుంచి దాడి చేసి, గొంతు పట్టుకుని నేలకు లాగింది. తర్వాత, మరో ఆరు సింహాలు ఆహారం అనుకుని గుంపులో చేరాయి. దాడిలో చేరాయి, దీంతో దాడి 15 నిమిషాల పాటు కొనసాగింది.
జియాన్ సఫారీ వరల్డ్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, వాహనం నుంచి బయటకు దిగాడు. తలుపు తెరిచి ఉంచాడు. ఈ దాడిని చూసిన పర్యాటకులు, థాయ్ , విదేశీయులు, కార్ల హారన్లు మోగించి, అరవడం ద్వారా సింహాలను ఆపడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు.