మొన్నీ మధ్య ఓ వ్యక్తి ఎక్కువ సమయం ఏడ్చి గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం ట్రై చేశాడు. కానీ ఏడవ లేకపోయారు. కొన్ని గంటల తర్వాత సైడ్‌ ఎఫెక్ట్‌ ప్రారంభమయ్యాయి. కళ్లు వాచిపోవడం, చూపు మందగించడంతో వైద్యుల సలహా మేరకు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అలాంటి ఛాలెంజ్‌ స్వీకరించిన ఓ యువతి ఇప్పుడు ఆసుపత్రిపాలైంది. 


ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు బాగా పెరిగిపోయాయి. ఆ ఛాలెంజ్‌ లు ఈ ఛాలెంజ్‌ లు అంటూ కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి కెనడాలో చోటు చేసుకుంది.


ఓ టిక్‌ టాకర్ రోజుకి 4 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగి పేరు సంపాదించేసుకోవాలి అని అనుకొని చివరికి ఆసుపత్రి పాలయ్యింది. సోషల్ మీడియా పిచ్చి ఎలా ఉందంటే.. రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవాలి. చేతికి అందినంత సంపాదించేసి జీవితంలో స్థిరపడిపోవాలి అనుకుంటున్నారు.


అలాగే కెనాడకు చెందిన మిచెల్‌ ఫెయిర్‌బర్న్‌ అనే టిక్‌ టాక్ స్టార్‌ అండ్రీ ఫ్రైసెల్లా అనే ఓ సోషల్‌ మీడియా స్టార్ 2019 లో ప్రారంభించిన 75 హార్డ్‌ అనే ఫిట్నెస్ ఛాలెంజ్‌ ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఆమె రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. 


ఈ ఛాలెంజ్ లో భాగంగా రోజుకు సుమారు 45 నిమిషాల పాటు రెండు సార్లు వర్కౌట్లు కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజూ ఇవన్నీ చేస్తున్నట్లు ఓ ఫోటో తీసి ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో పోస్ట్ కూడా చేయాలి.


ఈ ఛాలెంజ్ ను మిచెల్ చివరి వరకు కూడా  బాగానే చేసింది. 12 వ రోజున మాత్రం కొంచెం అసౌకర్యంగా అనిపించింది. దీంతో ఆమె డాక్టరును సంప్రదించింది. ఆమె ఒంట్లో సోడియం పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో డాక్టర్లు ఆమెకు రోజుకు కేవలం అరలీటర్ నీళ్లు మాత్రమే తాగాలని సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా మిచెల్‌ నే ప్రస్తావిస్తూ నేను ప్రస్తుతం అనారోగ్యానికి గురైన మాట నిజమే. కానీ నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తీరతాను అంటూ చెప్పుకొచ్చారు. 


ఈ ఛాలెంజ్‌ మొదటిసారి కావడంతో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎక్కువ నీళ్లు తాగడంతో రాత్రి పూట ఎక్కువగా టాయిలెట్ కు పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం డాక్టర్‌ కేవలం అరలీటర్ నీళ్లు మాత్రమే తాగమన్నారు. ఎంత కష్టమైనా కానీ నేను మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాను అని మిచెల్ పేర్కొన్నారు.