పదవి గండంలో పడిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అదే పనిగా భారత్ ను పొగుడుతున్నారు. భారత్‌లా మనం ఎందుకు ఉండలేకపోతున్నామని అక్కడి వారిని అడుగుతున్నారు. ప్రపంచంలో ఏ శక్తి ఇండియాను అడ్డుకోలేదని అనేశారు. భారతీయుల్ని ఖుద్దార్ ఖామ్ అంటూ ఇమ్రాన్ కీర్తించారు. దీన్ని విపక్ష నేతలు తప్పు పడుతున్నారు. ఇండియా ఆత్మాభిమానాన్ని మెచ్చుకుంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని అంతగా నచ్చితే ఆ దేశానికి వెళ్లాలంటూ ఇమ్రాన్‌పై ఆమె విమర్శలు చేస్తున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ ఇండియాను మెచ్చుకున్న ఇమ్రాన్ వైఖరిని మరియం ఖండించారు. ఇమ్రాన్ పాకిస్థాన్‌ను వదిలేసి, ఇండియాకు వెళ్లాలన్నారు అధికారం పోయిన తర్వాత ఇమ్రాన్ క్రేజీగా మారారని, ఆయన్ను తన స్వంత పార్టీ నేతలు బహిష్కరిస్తున్నారని మరియం ఆరోపించారు.
నిజానికి మరియం కూడా ఇమ్రాన్ ను విమర్శిస్తూ భారత్‌ను పరోక్షంగా పొగుడుతున్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలోనూ ఆయన భారత్‌ను అనుసరించాలని సూచిస్తున్నారు. భారత్‌లో వివిధ ప్రధానమంత్రులపై దాదాపు 27 అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ, ఇమ్రాన్‌లా లఎవ్వరూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, విలువలను అపహాస్యం చేయలేదు. వాజ్‌పేయి ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షలో ఓడారు. కానీ ఇమ్రాన్‌లా దేశాన్ని తాకట్టు పెట్టలేదు." అని మరియమ్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉర్దూలోనే ట్వీట్ చేసారు.
( ఉర్దూ అర్థం కాని వారు ట్విట్టర్‌లో ట్రాన్స్ లేట్ ఆప్షన్ ద్వారా ట్వీట్‌ను చదవవచ్చు )
"పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భయపడిన ఓ వెర్రివాడి వల్ల.. దేశం స్తంభించిపోయింది. 22 కోట్ల జనాభా గల దేశంలో వారాలుగా ప్రభుత్వమే లేదు. ఇంత దారుణ రాజ్యంగ ఉల్లంఘన, సుప్రీంకోర్టు ఆదేశాల విస్మరణ కారణంగా అతడి కథ ఘోరంగా ముగుస్తుంది." అని మండిపడ్డారు మరియమ్. విపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన దగ్గరి నుంచి పాక్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండా ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారు.
పాకిస్తాన్ రాజకీయ నేతలు అందరూ పదవులు పోయిన తర్వాత సొంత దేశాల్లో ఉండలేరు. రకరకాల కేసులతో వారిని ప్రతిపక్షాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. నవాజ్ షరీఫ్, ముషారఫ్ లాంటి వాళ్లు ప్రవాసంలోనే ఉన్నారు.