అన్వేషించండి

White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్

Donald Trump At White House | అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో శనివారం కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతిచెందాడు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ లోపలే ఉన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వైట్ హౌస్ సమీపంలో దుండగుడు కాల్పులు, సీక్రెట్ సర్వీస్ ఎదురుదాడి.
  • కాల్పులు జరిపిన 21 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
  • తీవ్రగాయాలైన నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
  • మానసిక సమస్యలతో బాధపడుతున్న దుండగుడిపై FBI విచారణ ప్రారంభించింది.

White House GunFire | వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం ఒక దుండగుడు కాల్పులు జరపడం కలకలం రేపింది.  అధ్యక్ష భవనం పశ్చిమ భాగంలో ఓ 21 ఏళ్ల యువకుడు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోనే ఉన్నారు. దాంతో వెంటనే అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీస్ కొన్ని సెకన్లలోనే ఎదురుదాడి చేసి కాల్పులకు పాల్పడిన నిందితుడిపై తూటాల వర్షం కురిపించింది. తీవ్రగాయాల పాలైన నిందితుడ్ని జార్జ్ వాషింగ్టన్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. అయితే, అతని పరిస్థితిపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

అసలేం జరిగిందంటే..  

అమెరికా మీడియా, సీక్రెట్ సర్వీస్ అధికారుల సమాచారం ప్రకారం, శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ దుండగుడు వైట్ హౌస్ పశ్చిమ వైపు గేట్ దగ్గరకు చేరుకున్నాడు. దాదాపు 6 గంటల 10 నిమిషాలకు, సీక్రెట్ సర్వీస్ అతన్ని 17వ స్ట్రీట్ నార్త్ వెస్ట్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించింది. దాంతో అతను ఒక్కసారిగా గన్ తీసి కాల్పులు జరిపాడు. నివేదికల ప్రకారం, నిందితుడి వద్ద హ్యాండ్ గన్ ఉంది. వైట్ హౌస్ పశ్చిమ వైపు గేట్ దగ్గర చాలా రౌండ్లు కాల్పులు జరిపాడు.

సీక్రెట్ సర్వీస్ ఎదురుదాడిలో నిందితుడు హతం 

దుండగుడు కాల్పులు మొదలుపెట్టగానే అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమై వెంటనే ఎదురు కాల్పులు జరిపింది. కొన్ని సెకన్లలోనే సెక్యూరిటీ సిబ్బంది సాయుధుడిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. హాస్పిటల్‌కు తరలించగా కాల్పులు జరిపిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బుల్లెట్ గాయాలు, తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయాడని సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. ఈ కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి సైతం గాయపడ్డాడు.

Also Read: USA Iran Peace Agreement:అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!

 సురక్షిత ప్రాంతానికి జర్నలిస్టుల తరలింపు

కాల్పుల శబ్దం వినగానే సీక్రెట్ సర్వీస్ వైట్ హౌస్ కాంపౌండ్ లో ఉన్న జర్నలిస్టులను వెంటనే నార్త్ లాన్ వైపు వెళ్లాలని, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి చేరుకోవాలని ఆదేశించింది. వైట్ హౌస్ నార్త్ లాన్ లో తన ఐఫోన్ తో సోషల్ మీడియా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని ABC న్యూస్ రిపోర్టర్ చెప్పారు. NBC న్యూస్ నివేదిక ప్రకారం, ఈ ఘటనలో మొత్తం 20 నుండి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు రిపోర్ట్ చేసింది. 

దుండగుడికి మానసిక సమస్యలు

న్యూయార్క్ పోస్ట్, ఫాక్స్ న్యూస్ నివేదికల ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తిని నాసిరే బెస్ట్ గా గుర్తించారు. ఏజెన్సీ అధికారులు సీక్రెట్ సర్వీస్ దర్యాప్తునకు సహాయం చేస్తున్నారని FBI డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. నిందితుడు మానసికంగా కలత చెందాడని, అతడి పరిస్థితికి సంబంధించి ఇటీవల ఓ ఆర్డర్ కూడా జారీ అయిందని రాయిటర్స్ పేర్కొంది. 

Also Read: Ivanka Trump Assassination Plot: ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?

ట్రంప్ ఇరాన్ శాంతి ఒప్పందంపై పోస్ట్ 

ఇరాన్‌తో సీజ్ ఫైర్ కొనసాగుతుందని, రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సమయంలో ఇటీవల కాల్పులు జరిగాయి. వైట్ హౌస్, అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల డిన్నర్ ఈవెంట్ లక్ష్యంగా ఓ వ్యక్తి కాల్పులు జరపడం తెలిపిందే. సెక్యూరిటీ సిబ్బంది త్వరగా స్పందించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇరాన్ తో శాంతి ఒప్పందంపై పని చేస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ చేసిన రెండు గంటల తర్వాత ఈ కాల్పుల ఘటన జరిగింది. 

Frequently Asked Questions

వైట్ హౌస్ సమీపంలో కాల్పులు ఎవరు జరిపారు?

వైట్ హౌస్ సమీపంలో ఓ 21 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. అతన్ని నాసిరే బెస్ట్ గా గుర్తించారు.

ఈ కాల్పుల ఘటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ఉన్నారా?

కాల్పులు జరిగిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. అయితే, ఆయనకు ఎలాంటి హాని జరగలేదు.

కాల్పులు జరిపిన వ్యక్తిని ఎలా అదుపులోకి తీసుకున్నారు?

దుండగుడు కాల్పులు జరపగానే సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపి అతడిని హతమార్చింది.

ఈ ఘటనలో గాయపడిన వారు ఎవరైనా ఉన్నారా?

కాల్పుల్లో నిందితుడితో పాటు మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. అయితే, అతని పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదు.

కాల్పులు జరిపిన వ్యక్తికి మానసిక సమస్యలు ఉన్నాయా?

నివేదికల ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తి మానసికంగా కలత చెంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతని పరిస్థితికి సంబంధించి ఓ ఆర్డర్ కూడా జారీ అయింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Elon Musk Net Worth 2026:తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!
తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyberabad Police Gym Extortion: ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Suriya Face Swap: ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
Aishwarya Rajesh : విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Mancherial Latest News: బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
Embed widget