Viral Video Turkey EarthQuake Horse Found Alive: ఈ నెలలో ప్రపంచంలో అతిపెద్ద విషాదం అంటే టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపాలు. వరుస భూకంపాలతో టర్కీలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 55 వేల మంది టర్కీ, సిరియా భూకంపాలలో ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ అద్భుతం జరిగింది. మూడు వారాలపాటు శిథిలాల కింద ఉన్న ఓ గుర్రం ప్రాణాలతో బయటపడింది. సహాయక చర్యలలో భాగంగా సిబ్బంది మూడు వారాల తరువాత శిథిలాల కింద ఉన్న ఓ గుర్రాన్ని రక్షించారు.


21 రోజులుగా శిథిలాల కింద నరకం
ఇటీవలి కాలంలో సంభవించిన అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం టర్కీ భూకంపాలు కాగా, భారత్ సహా పలు దేశాలు టర్కీ, సిరియాలకు మెడికల్, ఆహార సాయం చేశాయి. మూడు వారాల కిందట సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా వేలాది భవంతులు నేలమట్టం కాగా, లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వరుస భూకంపాలలో దాదాపు 55 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. టీర్కీలో భూకంపం సంభవించిన మూడు వారాల తర్వాత, ఒక భవనం శిథిలాలలో గుర్రం సజీవంగా ఉండటాన్ని గుర్తించారు. అదియామాన్ నగరంలో సోమవారం శిథిలాలను తొలగిస్తుండగా రెస్క్యూ టీమ్ ఓ గుర్నాన్ని కనుగొన్నారు. అయితే ఆ గుర్రం ప్రాణాలతో ఉండటం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. 21 రోజులు ఆహారం, నీళ్లు లేకున్నా గుర్రం బతికుండటం విశేషం.






దక్షిణ టర్కీలో సోమవారం సైతం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశ యొక్క విపత్తు నిర్వహణ సంస్థ AFAD ప్రకారం, తాజా భూకంపం కారణంగా మరో 69 మంది గాయపడ్డారు. యెస్లియుర్ట్ పట్టణంలో భూకంప కేంద్రం ఉంది. పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి.


టర్కీలో వరుస భూకంపాలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ దేశం ఎప్పటికి తేరుకుంటుందో కూడా తెలియదు. ఓ బేబీ వీడియో వైరల్ అయింది. ఎంత హార్ట్ టచింగ్ గా, వార్మ్ గా ఉందో. ఈ బేబీ భూకంప శిథిలాల కింద సుమారు 128 గంటలు చిక్కుకుపోయి ఉంది. ఆ రోజు ఆ బేబీ ఫొటో వీడియో బాగా వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆ అమాయకమైన ఫేస్ చూసి అయ్యో పాపం అనుకున్నవారే. శిథిలాల కింద ఆరు రోజుల పాటు పోరాడిన చిన్నారి ప్రాణాలతో కనిపించడంతో రెస్క్యూ టీమ్ తో పాటు మొత్తం టర్కీ వాసులకు ఓ సరికొత్త ఆశ రేకెత్తింది.


వణికిస్తున్న వరుస భూకంపాలు.. 
ఫిబ్రవరి 6న టర్కీ, పొరుగున ఉన్న సిరియా ఆగ్నేయ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తరువాత సంభవించిన ఈ వరుస భూకంపాలతో 50 నుంచి 55 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది లక్షల మంది నిరాశ్రయలు అయ్యారు. ఈ నెల చివరి వారంలోనూ ఆరుకు పైగా తీవ్రతతో దక్షిణ టర్కీలో భూ ప్రకంపనలు రావడంతో మిగిలిన ఇళ్లు కూలిపోయే అవకాశం ఉంది.